Share News

TSRTC: విజయవాడ వెళ్లే వారి కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు..

ABN , Publish Date - May 12 , 2024 | 03:03 PM

Andhrapradesh: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌‌కు ఇప్పటి వరకు 590 స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.

TSRTC: విజయవాడ వెళ్లే వారి కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు..
TSRTC MD Sajjanar

హైదరాబాద్, మే 12: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌‌కు ఇప్పటి వరకు 590 స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌ - విజయవాడ రూట్‌‌లో 140 సర్వీసులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం పెట్టినట్లు తెలిపారు. ఆయా బస్సుల్లో దాదాపు మూడు వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

AP Elections: విజయవాడ బస్టాండ్‌లో విపరీతమైన రద్దీ.. ఆర్టీసీపై ప్రయాణికుల ఫైర్


విజయవాడ రూట్‌ వైపునకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు. టికెట్ల ముందస్తు రిజర్వేషన్‌ కోసం tsrtconline.in వెబ్‌ సైట్‌‌ను సంప్రదించాలన్నారు. హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు1500 ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందన్నారు. జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను తిప్పుతోందన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటుహక్కును వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.


ఇవి కూడా చదవండి..

AP Elections2024: చంద్రబాబు ఓటు వేసేది ఎక్కడంటే..

AP Elections: వంగా గీత కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఓటర్లు... విషయం ఇదే!

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2024 | 03:37 PM