Share News

Radisson Drug Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టు..

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:16 AM

హైదరాబాద్: రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టు ఎదురైంది. గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరుకాకుండా డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం ఈరోజు వ్యక్తిగతంగా హాజరవుతానంటూ పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు.

Radisson Drug Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టు..

హైదరాబాద్: రాడిసన్ డ్రగ్స్ కేసు (Radisson Drug Case)లో ట్విస్టు (Twist)ఎదురైంది. గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరుకాకుండా డైరెక్టర్ క్రిష్ (Director Krish) హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం ఈరోజు వ్యక్తిగతంగా హాజరవుతానంటూ పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. నిన్న మళ్లీ పోలీసులకు ఫోన్ చేసి తనకు మరో రెండు రోజుల సమయం కావాలని కోరారు. అయితే ఇవాళ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందేనని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో ఈరోజు విచారణకు క్రిష్ హాజరుపై సస్పెన్స్ నెలకొంది.

రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అయితే ఈరోజు డైరెక్టర్ క్రిష్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ తన వ్యక్తిగత కారణాలు, సినిమా షూటింగ్స్ వల్ల ముంబైలో ఉన్నానని, శుక్రవారం ఉదయం విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. కాగా శుక్రవారం విచారణకు రావాల్సిందిగా నిన్న మధ్యాహ్నం పోలీసులు క్రిష్‌కు సమాచారమిచ్చారు. అయితే మరో రెండు రోజులు సమయం కావాలని ఆయన పోలీసులను కోరారు. దీంతో క్రిష్ విజ్ఞప్తిని పోలీసులు నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం ఉదయం విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఈలోగా తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతో క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశముంది. కాగా పోలీసుల ఆదేశాల ప్రకారం ఈరోజు క్రిష్ విచారణకు హాజరవుతారా? లేదా? అన్న సస్పెన్షన్ నెలకొంది.

రాడిసన్ కొకైన్ పార్టీ కేసులో కొత్త కోణాలు

కాగా రాడిసన్ కొకైన్ పార్టీ కేసులో కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఆ పార్టీలో మొత్తం 7 గ్రాముల కొకైన్ సప్లై అయినట్లు పోలీసులు గుర్తించారు. అబ్బాస్ అలీ స్టేట్‌మెంట్‌తో కీలక విషయాలు బయటపడ్డాయి. రాడిసన్ హోటల్లో 3 గ్రాముల కొకైన్ మాత్రమే వినియగించారని, మరో 4 గ్రాముల కొకైన్‌పై ఎస్‌వోటీ, గచ్చిబౌలి పోలీసులు ఆరా తీస్తున్నారు. గత నెల 16న 2 గ్రాములు, 17న 2 గ్రాములు, 18న ఒక గ్రాము, 19న మరో 2 గ్రాముల కొకైన్ సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసుల విచారణకు రాకుండా 7గురు నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారు.

4 గ్రాముల కంటే తక్కువ పరిమాణం ఉంటే కోర్టులో కేసు నిలబడదని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే మంజీరా గ్రూప్స్ డైరెక్టర్ వివేకానంద్ , పెడ్లర్ అబ్బాస్, డ్రైవర్ ప్రవీణ్ అరెస్టు అయ్యారు. నిర్బయ్, కేదార్లను విచారించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు వెళ్తే డ్రగ్ పాజిటివ్ వస్తుందని భయపడి నిందితులు పరారీలో ఉన్నారు. రోజులు గడిస్తే నిరూపించడం ఇబ్బందికరంగా మారుతుందని పోలీసులు అంటున్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:16 AM