TG News: 64 కేజీల గంజాయి సీజ్ చేసాం.. టాస్క్ ఫోర్స్ డీసీపీ
ABN , Publish Date - Jun 16 , 2024 | 12:58 PM
హైదరాబాద్: భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 64 కేజీల గంజాయి పట్టుకుని సీజ్ చేసామని, ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆదివారం డీసీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
హైదరాబాద్: భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 64 కేజీల గంజాయి (Marijuana) పట్టుకుని సీజ్ చేసామని, ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని టాస్క్ ఫోర్స్ డీసీపీ(Task Force DCP) రేష్మి పెరుమాళ్ (Reshmi Perumal) తెలిపారు. ఈ సందర్బంగా ఆదివారం డీసీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో ఈ ముగ్గురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ (NDPS Act) కింద కేసులు ఉన్నాయని, ప్రధాన నిందితుడు షేక్ పర్వేజ్ హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌కు చెందినవాడని చెప్పారు. రావులపాలెం, హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌లో పీఎస్‌లో ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయన్నారు. రావులపాలెం ఎన్డీపీఎస్ కేసులో షేక్ పర్వేజ్ అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉన్నాడని చెప్పారు. అదే సమయంలో ఓడిశాలోని కలిమెల ప్రాంతానికి చెందిన గంజాయి రైతు దీపక్‌ని కలిశాడని డీసీపీ తెలిపారు.
ఏప్రిల్, 2024 నెలలో లంగర్ హౌజ్ ఎన్డీపీఎస్ కేసులో షేక్ పర్వేజ్ జైలు నుండి విడుదలయ్యాడని, బయటకు వచ్చాక సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడని డీసీపీ రేష్మి పెరుమాళ్ అన్నారు. తన సహచరుల ద్వారా ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి రప్పించాలని ప్లాన్ చేశాడని.. ఇందులో భాగంగా దీపక్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో గంజాయిని నగరానికి తెప్పించాడన్నారు. బస్సులో వచ్చిన గంజాయిని షేక్ ఫర్వేజ్ హైదరాబాద్‌లో రిసీవ్ చేసుకునేవాడని చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి తరలిస్తుండగా భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్ పర్వేజ్‌ను అరెస్ట్ చేశామని.. ముగ్గురు నిందితులను తదుపరి చర్యల నిమిత్తం భవాని నగర్ పోలీసులకు అప్పగించామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడుటలేదు..
జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఫైర్
మొదటి దశను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తాం
దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News