TG News: లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి...
ABN , Publish Date - Sep 06 , 2024 | 04:19 PM
Telangana: లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలైన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుత్బుల్లాపూర్, సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన ఎంకే విద్యార్థి భాను ప్రకాష్ (22) కనిపించడం లేదంటూ నిన్న (గురువారం) జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది.
మేడ్చల్ జిల్లా, సెప్టెంబర్ 6: లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలైన ఘటన మేడ్చల్ జిల్లాలో (Medchal) చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుత్బుల్లాపూర్, సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన ఎంకే విద్యార్థి భాను ప్రకాష్ (22) కనిపించడం లేదంటూ నిన్న (గురువారం) జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది.
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా..
ఆరోరా కళాశాలలో మాస్టర్స్ చదువుతున్న భాను ప్రకాష్ లోన్‌యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు. అయితే తిరిగి లోన్ చెల్లించకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. తీసుకున్న లోన్ కట్టాల్సిందే అంటూ లోన్‌యాప్ పట్టుబట్టారు. దీంతో లోప్‌ఆప్ప్ వేధింపులు తాళలేక భాను, నిన్న సాయంత్రం ఫాక్స్ సాగర్ చెరువులో దూకి బలన్మరణానికి పాల్పడ్డాడు. మొబైల్ లొకేషన్ ద్వారా స్నేహితులు భాను ప్రకాష్ ఆచూకీని కనుగొన్నారు. చెరువు వద్దకు వెళ్లి చూడగా అతని దుస్తులు, వాహనం గట్టుపై ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Jio offers: రూ.75కే అదిరిపోయే ఆఫర్ అందిస్తున్న జియో
కేసు నమోదు చేసుకున్న పెట్ బషీరాబాద్ పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు... లోన్ యాప్‌కు సంబంధించిన చాటింగ్‌ను పరిశీలిస్తున్నారు. లోన్‌యాప్ నిర్వహకుల వేధింపులకు భాను ప్రకాష్ ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో సంజయ్‌గాంధీ నగర్‌లో విషాదం అలముకుంది.
ఇవి కూడా చదవండి...
Rain Effect: వరద బీభత్సానికి దెబ్బతిన్న వేలాది కార్లు.. గగ్గోలు పెడుతున్న వాహనదారులు..
Heavy Rains: భారీ వర్షాలతో తెలంగాణ ఏ రేంజ్‌లో నష్టం జరిగిందంటే?
Read Latest Telangana News And Telugu News