Share News

Interviews: ‘ఉస్మానియా, గాంధీ’లో ఇంటర్వ్యూలు

ABN , Publish Date - Aug 10 , 2024 | 03:30 AM

ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో వివిధ కేటగిరీల్లో కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టిన పోస్టుల భర్తీకి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉస్మానియాలో 175 ప్రొఫెసర్‌ పోస్టులకుగాను 651 దరఖాస్తులు వచ్చాయి. 572 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు.

Interviews: ‘ఉస్మానియా, గాంధీ’లో ఇంటర్వ్యూలు

  • కాంట్రాక్టు పద్ధతిలో పోస్టుల భర్తీకి నిర్వహణ

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో వివిధ కేటగిరీల్లో కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టిన పోస్టుల భర్తీకి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉస్మానియాలో 175 ప్రొఫెసర్‌ పోస్టులకుగాను 651 దరఖాస్తులు వచ్చాయి. 572 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విభాగంలో పాథాలజీలో 12 పోస్టులుండగా.. 58 మంది ఇంటర్వ్యూకు వచ్చారు. పిడియాట్రిక్‌ విభాగంలో 8 పోస్టులకు 41 మంది, జనరల్‌ సర్జరీలో 4 పిడియాట్రిక్‌ పోస్టులకుగాను 33 మంది, ఈఎన్‌టీలో ఒక పోస్టుకు 22 మంది, ఆఫ్తాల్మాజీలో 6 పోస్టులకు 32 మంది, ఆర్థోలో 4 పోస్టులకు 43 మంది, అనస్తీషియాలో 8 పోస్టులకు 45 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.


అన్ని విభాగాల్లో కలిపి ఉస్మానియాలో 111 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 440 మంది హాజరయ్యారు. కాగా, ఈ స్థాయిలో అభ్యర్థులు వస్తారని వైద్య శాఖ ఉన్నతాధికారులు కూడా ఊహించలేదు. ఇక గాంధీలో 60 పోస్టులకును 79 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 3 ప్రొఫెసర్‌ పోస్టులు, 29 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, 24 సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు, 4 ట్యూటర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌ నేతృత్వంలో ఉస్మానియా ఆస్పత్రిలో.. గాంధీలో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ వాణి ఆధ్వరంలో ఇంటర్వ్యూలు చేపట్టారు. 12న ప్రొవిజనల్‌ జాబితాను విడుదల చేయనున్నారు. 14న ఎంపికైన వారి జాబితాను విడుదల చేస్తారు.

Updated Date - Aug 10 , 2024 | 03:30 AM