Share News

Jaggareddy : రాజీవ్‌ గాంధీ సేవలను దేశం మరువదు

ABN , Publish Date - Aug 14 , 2024 | 03:50 AM

దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన రాజీవ్‌ గాంధీ అమరజ్యోతి యాత్ర మంగళవారం సంగారెడ్డికి చేరుకుంది.

Jaggareddy : రాజీవ్‌ గాంధీ సేవలను  దేశం మరువదు

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

  • శ్రీపెరంబదూర్‌ నుంచి ఢిల్లీ వెళుతున్న అమరజ్యోతి యాత్రకు స్వాగతం

  • సంగారెడ్డిలో వాహనాలతో భారీ ర్యాలీ

సంగారెడ్డి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన రాజీవ్‌ గాంధీ అమరజ్యోతి యాత్ర మంగళవారం సంగారెడ్డికి చేరుకుంది. ఆర్‌.దొరై ఆధ్వర్యంలో చేపట్టిన యాత్రకు జగ్గారెడ్డితో పాటు టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సంగారెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని రాజీవ్‌ గాంధీ దేశంలో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఐటీ వ్యవస్థ పటిష్ఠమైందంటే నాడు రాజీవ్‌ గాంధీ చొరవే కారణమన్నారు. టెక్నాలజీతో పాటు పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేశారన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Aug 14 , 2024 | 03:50 AM