Share News

Jajula Srinivas Goud: బీసీలకు రాజ్యాధికారం కోసం త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:53 AM

బీసీలకు రాజ్యాధికార కోసం ప్రత్యేకంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. కరీంనగర్‌లో బుధవారం బీసీ సమగ్ర కుల గణన సాధన యాత్ర ముగింపు సభ నిర్వహించారు.

Jajula Srinivas Goud: బీసీలకు రాజ్యాధికారం కోసం త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు

  • ఆగస్టు చివరి వారంలోపు కులగణన చేయాలి

  • లేకుంటే లక్ష మందితో హైదరాబాద్‌ దిగ్బంధిస్తాం

  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల

గణేశ్‌నగర్‌, జూలై 31: బీసీలకు రాజ్యాధికార కోసం ప్రత్యేకంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. కరీంనగర్‌లో బుధవారం బీసీ సమగ్ర కుల గణన సాధన యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే ఆరు నెల ల్లో బీసీ గణన చేసి రిజర్వేషన్‌ పెంచుతామని ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ చేసిందని, దాన్ని ఆ పార్టీకి గుర్తు చేయడానికే తాను కామారెడ్డి నుంచి యాత్ర ప్రారంభించానన్నారు.


బీసీ రిజర్వేషన్‌ పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్‌ కల్పించకుంటే గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేసి బీసీల వాటా తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 2న తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్ల ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని, ఆగస్టు చివరి వారంలోపు కులగణన చేయకుంటే లక్ష మందితో హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.

Updated Date - Aug 01 , 2024 | 04:53 AM