Kaleshwaram Project: నేడు రాష్ట్రానికి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్
ABN , Publish Date - Nov 21 , 2024 | 03:56 AM
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. విచారణ నిమిత్తం జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం సాయం త్రం హైదరాబాద్ వస్తున్నారు.
‘కాళేశ్వరం’పె ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌ల క్రాస్ ఎగ్జామినేషన్?
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. విచారణ నిమిత్తం జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం సాయం త్రం హైదరాబాద్ వస్తున్నారు. డిసెంబరు 5వ తేదీ వరకు రాష్ట్రంలోనే ఉండనున్నారు. విచారణలో భాగంగా శనివారం(23వ తేదీ) నుంచి ఐఏఎ్‌సలు/మాజీ ఐఏఎ్‌సలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారని సమాచారం. ఎవరెవరినీ విచారణకు పిలవాలనే అంశంపై శుక్రవారం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నెలాఖరున లేదా డిసెంబరు తొలి వారంలో విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణంపై విధాన నిర్ణయం తీసుకున్న వారితోపాటు ఆ నిర్ణయాల్లో భాగస్వాములైన మాజీ కీలక ప్రజాప్రతినిధులను విచారణకు పిలిచే అవకాశాలున్నాయి.