Share News

TS News: తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 11 , 2024 | 03:04 PM

దుబ్బాక పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

TS News: తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
Kotha Prabhakar Reddy

సిద్దిపేట : దుబ్బాక పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కూడా పాల్గొన్నారు. మొత్తం 400 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యానని అన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.


రాష్ట్రంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటివరకు రైతులకు కాలువల ద్వారా నీరు ఇచ్చిన పాపాన పోలేదని, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయనీయకుంటే చెక్కులు వెనక్కి వెళ్లిపోయాయని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఏ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లినా నయాపైసా విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.


Untitled-3.jpg

మరోవైపు.. దుబ్బాక నియోజకవర్గంలో ఈనెల 13 నుంచి 18 వరకు దుబ్బాకలో శ్రీ బాలాజీ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో కొత్త ప్రభాకర్ రెడ్డిని బాలాజీ దేవాలయ కమిటీ సభ్యులు, అర్చకులు కలిశారు. బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు.

Updated Date - Aug 11 , 2024 | 03:09 PM