Delhi Liquor Scam: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
ABN , Publish Date - Aug 06 , 2024 | 03:34 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా పడింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా పడింది. తనను అక్రమంగా అరెస్టు చేశారని, చార్జిషీటే సరిగా లేదని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం సీబీఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా విచారణ చేపట్టారు.
సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరని, తమకు సమయం కావాలని కవిత తరఫున న్యాయవాది కోరగా.. బుధవారం తుది వాదనలు వినిపించాలని జడ్జి ఆదేశించారు. గతంలోనే రెండుసార్లు బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ట్రయల్ కోర్టు ఈ సారి ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. కాగా, మంగళవారం ఉదయం కవితను తిహాడ్ జైలులో ఆమె సోదరుడు కేటీఆర్‌తోపాటు ఎమ్మెల్యే హరీశ్‌రావు కలిసే అవకాశం ఉంది.