Share News

Former CM KCR : తొందర పడొద్దు

ABN , Publish Date - Jun 26 , 2024 | 03:43 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రె్‌సలో చేరడం, మరికొందరు అదేబాటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ రంగంలోకి దిగారు. ఫిరాయింపులకు కళ్లెం వేసేందుకుగాను ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు.

Former CM KCR : తొందర పడొద్దు

  • నా దగ్గర ప్లాన్‌ ఉంది.. కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు

  • నెల కూడా పట్టదు.. ధైర్యంగా ఉండండి

  • ఏ ఇబ్బంది కలిగినా.. నేరుగా నా వద్దకు రండి

  • మీకు ఎటువంటి నష్టం జరగనివ్వను

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్‌

  • పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో ఫాంహౌస్‌లో భేటీ

  • రైల్‌ రోకో కేసుపై హైకోర్టు స్టే

  • కేసీఆర్‌ పాల్గొన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్య

  • విద్యుత్తు కమిషన్‌ చెల్లదు.. నోటీసుల్ని కొట్టేయండి

  • హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన మాజీ సీఎం

  • విచారణకు రండి!

  • కేసీఆర్‌కు జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ నోటీసు

  • వారంలో వాస్తవాలను వివరించాలని శ్రీముఖం

హైదరాబాద్‌/మర్కుక్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రె్‌సలో చేరడం, మరికొందరు అదేబాటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ రంగంలోకి దిగారు. ఫిరాయింపులకు కళ్లెం వేసేందుకుగాను ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. ఈ మేరకు మంగళవారం పలువురు ఎమ్మెల్యేలను సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌ్‌సకు పిలిపించుకొని చర్చలు జరిపారు. మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్‌, మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌, మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు శేరి సుభా్‌షరెడ్డి, దండె విఠల్‌, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్‌, రావుల శ్రీదర్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.


తొలుత తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత విషయాలపై అందరు ఎమ్మెల్యేలతో చర్చించిన కేసీఆర్‌.. ఆ తర్వాత ఒక్కొక్కరితో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ’’నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. తొందరలోనే అనుకూల పరిస్థితులు వస్తాయి. అదీ నెలలోపే. ఎవరూ అధైర్యపడొద్దు.. కొన్ని తప్పుల వల్ల మనం ఓడిపోయాం. ఇప్పుడు దాని గురించి బాధపడితే ప్రయోజనం లేదు. మీరు నన్ను నమ్ముకున్నారు.. నేనూ మిమ్మల్ని నమ్మాను. ఇలాంటి సమయంలో పార్టీ మారే ఆలోచన చేయొద్దు.

కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరగనున్నాయి. తొందర పడకండి.. వేచి చూస్తే మనందరికీ మంచిది’’ అని ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు మారడానికి నెల సమయం కూడా పట్టదన్నారు. ’’పదేళ్లు నన్ను నమ్ముకొని ఉన్నారు. మీకు నష్టం కలగకుండా చూసుకుంటా. మంచో చెడో ఓడిపోయాం.. మిమ్మల్ని నాశనం చేయను. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా నా దగ్గరకు రండి.. ఫోన్‌ చేయండి. వాళ్లూ వీళ్లూ ఎవరూ ఉండాల్సిన పనిలేదు. నేరుగా వచ్చి నన్ను కలవండి’’ అని కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది.

మనం కఠినంగా వ్యవహరించలేదు..

తాము అధికారంలో ఉన్నప్పుడు కఠినంగా ఉండలేదని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, కొందరు నేతలు వచ్చి పనులు అడిగితే చేశామని కేసీఆర్‌ తెలిపారు. వారు కూడా తమ పట్ల మంచి భావంతోనే ఉన్నారని, అయితే వారి పార్టీ వేరు.. తమ పార్టీ వేరు అంతే అని వ్యాఖ్యానించారు. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి సహా ఒకరిద్దరు పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్‌ఎ్‌సకు వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. ’’ఇలాంటి పరిణామాలు ఆనాటి వైఎస్‌ హయాంలొనే జరిగాయి. అయినా మనం భయపడలేదు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సమీప భవిష్యత్తులో మనకు మంచి రోజులు వస్తాయి’’ అని కేసీఆర్‌ చెప్పారు. ఇకనుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశాలు ఉంటాయని తెలిపారు.

Updated Date - Jun 26 , 2024 | 03:43 AM