Share News

SP Dance: డాన్స్‌తో అదరగొట్టిన ఎస్పీ రోహిత్ రాజ్

ABN , Publish Date - May 20 , 2024 | 02:01 PM

కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరోసారి సందడి చేశారు. కేసులతో బిజీగా ఉన్న ఆయన రిలాక్స్‌గా తెలుగు పాటలకు మాస్ స్టెప్‌లేసి ఆదరగొట్టారు. ఎస్పీ డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 SP Dance: డాన్స్‌తో అదరగొట్టిన ఎస్పీ రోహిత్ రాజ్

కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothaguden Dist.) ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohit Raj) మరోసారి సందడి చేశారు. కేసులతో బిజీగా ఉన్న ఆయన రిలాక్స్‌గా తెలుగు పాటలకు మాస్ స్టెప్‌లేసి ఆదరగొట్టారు. ఎస్పీ డ్యాన్స్ (Dance) సోషల్ మీడియా (Social Media)లో హల్ చల్ చేస్తోంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన ఏజెన్సీ జిల్లాల్లో ఎన్నికల బందోబస్తును సక్సెస్ ఫుల్‌గా ముగియడంతో ఎస్పీ రోహిత్ రాజ్ గెట్ టూ గెదర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రైవేటు పార్టీలో ఎస్పీ రోహిత్ రాజ్, పోలీస్ సిబ్బందితో కలిసి సరదాగా డ్యాన్స్ చేసి అలరించారు.


కాగా ఎస్పీ రోహిత్ రాజ్ డ్యాన్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎస్సీ హోదాలో ఉండి.. తోటి ఉద్యోగులతో కలిసి మెలిసి సరదాగా ఉండటం అభినందనీయమని కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!

జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు

పోలీసులను ఆట ఆడించేది జగనేనా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 20 , 2024 | 02:04 PM