Kishan reddy: డీఎస్ అందించిన ప్రోత్సాహం మరవలేను
ABN , Publish Date - Jun 29 , 2024 | 08:07 AM
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శ్రీ ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. డి శ్రీనివాస్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు.
హైదరాబాద్: సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శ్రీ ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. డి శ్రీనివాస్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. డి.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ ఎంపీ అరవింద్‌కి, ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ట్విటర్ వేదికగా వెల్లడించారు. రాజకీయ ప్రముఖులంతా డీఎస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డీఎస్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014 ఎన్నికల తర్వాత సొంత జిల్లాలో వర్గపోరుతో సతమతమయ్యారు. డీఎస్ అంత్యక్రియలు రేపు ఉదయం నిజామాబాద్‌లో జరగనున్నాయి.