Share News

Pawan Kalyan: కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో ప్రభంజనం

ABN , Publish Date - Jun 05 , 2024 | 10:08 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విక్టరీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. ఎన్నికల్లో గడప గడపకు ప్రచారం చేశారు. జగన్ నిరంకుశ వైఖరి, గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపారు. దాంతో కూటమికి ప్రజలు పట్టం కట్టారు.

Pawan Kalyan: కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో ప్రభంజనం
Pawan Kalyan

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విక్టరీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. ఎన్నికల్లో గడప గడపకు ప్రచారం చేశారు. జగన్ నిరంకుశ వైఖరి, గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపారు. దాంతో కూటమికి ప్రజలు పట్టం కట్టారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జయభేరి మోగించారు. ఆ పార్టీకి చెందిన 20 మంది అభ్యర్థులు కూడా గెలుపొందారు. దీంతో పవన్ కల్యాణ్ సెంటిమెంట్ కొండగట్టు ఆంజనేయ స్వామి మరోసారి చర్చకు వచ్చింది.


కొండగట్టు సెంటిమెంట్..!!

పవన్ కల్యాణ్‌కు కొండగట్టు అంజన్న అంటే అమితమైన భక్తి ఉంటుంది. పవన్ కల్యాణ్ ఒక్కరే కాదు మెగా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామిని ఇష్టంగా కొలుస్తారు. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్‌కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. హైటెన్షన్ వైర్లు పడటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి కొండగట్టు అంజన్నను పవన్ కల్యాణ్ ఇలవేల్పుగా ఆరాధిస్తున్నారు. ఏ మంచి పని చేపట్టిన ముందుగా కొండగట్టు వెళుతుంటారు.


వారాహికి పూజలు

గత ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ కల్యాణ్ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించారు. ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టు అంజన్న ఆలయంలో నిర్వహించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల గురించి కూడా జనవరి 24వవ తేదీన కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. టీడీపీ- జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. తర్వాత భారతీయ జనతా పార్టీ చేరింది. కూటమి బలపడి విజయం సాధించింది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తమకు మంచి జరిగిందని మెగా ఫ్యామిలీ భావిస్తోంది.


తొలిసారి గెలుపు

2019లో రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ పవన్ కల్యాణ్ గెలుపొందలేరు. ఈ సారి పిఠాపురం నుంచి బరిలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు. కూటమికి అధికారం కట్టబెట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు. దీనంతటికీ కారణం కొండగట్టు అంజన్న అని పవన్ కల్యాణ్, అతని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. నిజమే మరి గత ఎన్నికల్లో టీడీపీ కేవలం 22 సీట్లు, జనసేనాని ఓటమి పాలయ్యారు. ఈ సారి కూటమి ప్రభంజనం సృష్టించడంలో పవన్ కల్యాణ్‌కు కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఉన్నాయని అతని కుటుంబ సభ్యులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.

Updated Date - Jun 05 , 2024 | 10:08 AM