Share News

Lok Sabha Elections: ఎంపీడీవోలను వీడని ‘కోడ్‌’

ABN , Publish Date - Aug 09 , 2024 | 03:53 AM

లోక్‌సభ ఎన్నికల సమయంలో కొందరు ఉన్నతాధికారుల అత్యుత్సాహం మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల(ఎంపీడీవోలు)కు శాపంగా మారింది.

Lok Sabha Elections: ఎంపీడీవోలను వీడని ‘కోడ్‌’

  • నిబంధనల్లో పేర్కొనకున్నా.. ఎన్నికల సమయంలో బదిలీలు

  • కోడ్‌ ముగిసినా.. వెనక్కి పంపని సర్కారు

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల సమయంలో కొందరు ఉన్నతాధికారుల అత్యుత్సాహం మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల(ఎంపీడీవోలు)కు శాపంగా మారింది. ఎన్నికల కోడ్‌ సమయంలో ఎంపీడీవోలను బదిలీ చేయాలని నిబంధనల్లో లేకున్నా.. రాష్ట్రంలో పలువురికి స్థానచలనం కలిగించారు. ఈసీ అధికారులకు ఈ విషయం తెలిసినా.. తిప్పి పంపకపోవడంతో.. సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11న అధికారులు హడావుడిగా 300ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి.. 12వ తేదీన విధుల్లో చేరాలని ఆదేశించారని ఎంపీడీవోల సంఘం నేతలు చెబుతున్నారు.


వీరిలో 200 మంది ఎంపీడీవోలను సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారని.. కొందరైతే 350-400 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నిబంధనల్లో ఎక్కడా ఎంపీడీవోలను బదిలీ చేయాలని లేదని ఎన్నికల కమిషన్‌ అధికారులకు విన్నవించినా.. వారు పట్టించుకోలేదని వివరించారు. ఎన్నికల కోడ్‌ ముగిసినా.. 300 మంది ఎంపీడీవోలను పాత స్థానాలకు పంపలేదని చెప్పారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

Updated Date - Aug 09 , 2024 | 03:53 AM