Share News

TS NEWS: సిద్దిపేటలో మహిళపై ఎస్ఐ అత్యాచారయత్నం.. కేసు నమోదు

ABN , Publish Date - Feb 18 , 2024 | 08:10 PM

సామాన్యంగా పోలీసులు ప్రజల రక్షణ కోసం పనిచేయాలి కానీ సిద్దిపేట జిల్లాలో ఓ రక్షకుడు భక్షుకుడిగా మారాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిపై ఎస్ఐ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ అధికారి తీరుపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం చేస్తున్నాయి.

TS NEWS: సిద్దిపేటలో మహిళపై ఎస్ఐ అత్యాచారయత్నం.. కేసు నమోదు

సిద్దిపేట: సామాన్యంగా పోలీసులు ప్రజల రక్షణ కోసం పనిచేయాలి కానీ సిద్దిపేట జిల్లాలో ఓ రక్షకుడు భక్షుకుడిగా మారాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిపై ఎస్ఐ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ అధికారి తీరుపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... ఎస్‌ఐ అరుణ్ పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సదరు ఎస్‌ఐ అరుణ్ సిద్దిపేట కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

ఈ ఘటనపై యువతి ఎస్‌ఐపై సైదాబాద్‌‌లోని ఉన్నత స్థాయి అధికారులకు ఆదివారం నాడు ఫిర్యాదు చేసింది. అధికారులు ఎస్‌ఐపై కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అరుణ్ మోసం చేశాడని యువతి పేర్కొంది. ఓ కేసుపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో తన ఫోన్ నంబర్‌‌ను ఎస్ఐ అరుణ్ తీసుకుని ప్రేమించానని చెప్పాడని తెలిపింది. ఎస్‌ఐ అరుణ్‌ను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ెస్‌ఐను కఠినంగా శిక్షించాలని యువతి, మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 18 , 2024 | 08:17 PM