Share News

MLA: చిరువ్యాపారులను ఇబ్బందులకు గురిచేయొద్దు..

ABN , Publish Date - Aug 07 , 2024 | 11:44 AM

ట్రాఫిక్‌ నిబంధనల పేరుతో చిరు (ఫుట్‌పాత్‌) వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయొద్దని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Sanatnagar MLA Talasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు. మోండా మార్కెట్‌ డివిజన్‌ పరిధిలోని మోండా మార్కెట్‌, ఓల్డ్‌ గాంధీ హాస్పిటల్‌, ఓల్డ్‌ జైల్‌ఖానా తదితర ప్రాంతాలకు చెందిన పలువురు చిరువ్యాపారులు (హాకర్స్‌) మంగళవారం వెస్ట్‌మారేడుపల్లిలోని ఆయన నివాసం వద్ద కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.

MLA: చిరువ్యాపారులను ఇబ్బందులకు గురిచేయొద్దు..

- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

హైదరాబాద్: ట్రాఫిక్‌ నిబంధనల పేరుతో చిరు (ఫుట్‌పాత్‌) వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయొద్దని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Sanatnagar MLA Talasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు. మోండా మార్కెట్‌ డివిజన్‌ పరిధిలోని మోండా మార్కెట్‌, ఓల్డ్‌ గాంధీ హాస్పిటల్‌, ఓల్డ్‌ జైల్‌ఖానా తదితర ప్రాంతాలకు చెందిన పలువురు చిరువ్యాపారులు (హాకర్స్‌) మంగళవారం వెస్ట్‌మారేడుపల్లిలోని ఆయన నివాసం వద్ద కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.

ఇదికూడా చదవండి: Union Minister: పంద్రాగస్టు తర్వాత.. నగరాభివృద్ధిపై సమీక్ష


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ఎన్నో సంవత్సరాలుగా చిన్నచిన్న వ్యాపారాలను చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ ట్రాఫిక్‌ పోలీసులు(Traffic Police) తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని వారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(MLA Talasani Srinivas Yadav)ను కోరారు. స్పందించిన ఆయన వెంటనే మోండా మార్కెట్‌ ట్రాఫిక్‌ సీఐకి ఫోన్‌ చేసి హాకర్స్‌ను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆదేశించారు.

city4.2.jpg


ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని హాకర్స్‌ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హాకర్స్‌ అసోసియేషన్‌ నగర అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి మేకల అశోక్‌, శివ, గోవర్ధన్‌, రాజు, అల్తాఫ్‌, బబ్లు తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?

దికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!

Updated Date - Aug 07 , 2024 | 11:50 AM