Share News

MLA: ఎమ్మెల్యే సబితారెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

ABN , Publish Date - Oct 09 , 2024 | 11:17 AM

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం తన పుట్టినిల్లు వంటిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి(Former Minister, Maheshwaram MLA P. Sabitha Indra Reddy) అన్నారు.

MLA: ఎమ్మెల్యే సబితారెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

- రాజేంద్రనగర్‌ నా పుట్టినిల్లు: ఎమ్మెల్యే సబిత

హైదరాబాద్: రాజేంద్రనగర్‌ నియోజకవర్గం తన పుట్టినిల్లు వంటిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి(Former Minister, Maheshwaram MLA P. Sabitha Indra Reddy) అన్నారు. మైలార్‌దేవుపల్లి డివిజన్‌ బాబుల్‌రెడ్డినగర్‌లో నవదుర్గ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఇంద్రారెడ్డిని ఎంతగానో ఆదరించారని, తనను కూడా అక్కున చేర్చుకుని అండగా నిలబడ్డారని గుర్తుచేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చెత్త వేస్తే.. రూ. 1000 ఫైన్‌ కట్టాల్సిందే..


రాబోయే రోజులలో తన కుమారుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డికి ప్రతి ఒక్కరూ ఆండగా నిలచి దీవించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ ఎస్‌.వెంకటేశ్‌, వార్డు కమిటీ మాజీ సభ్యుడు సోమ శ్రీనివాస్‌ గుప్తా, నాయకులు డి.రమేశ్‌ ముదిరాజ్‌, నోముల రాము యాదవ్‌, అక్కెం రాఘవేందర్‌ యాదవ్‌, బండ రాజేశ్‌ యాదవ్‌, కార్తీక్‌ ముదిరాజ్‌, అరుణ్‌ ముదిరాజ్‌, సురేశ్‌ ముదిరాజ్‌, మైసిరెడ్డి, గంజి రాజు, కొంపల్లి జగదీశ్‌, ఈశ్వరయ్య, సంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌, మల్లేశ్‌, శివ, రామక్రిష్ణ పాల్గొన్నారు.


.........................................................................

ఈ వార్తను కూడా చదవండి:

............................................................................

Hyderabad: సైబర్‌ నేరగాళ్లు కాజేసిన డబ్బు రికవరీ..

- రూ. 21.55 లక్షలు బాధితుల ఖాతాల్లో జమ

హైదరాబాద్‌ సిటీ: నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) కాజేసిన డబ్బు రూ. 21.55 లక్షలను పోలీసులు రికవరీ చేశారు. సాంకేతిక ఆధారాల ద్వారా సైబర్‌ నేరస్థులు డబ్బును ఏ ఖాతాలకు మళ్లించారో గుర్తించి ఆ ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు. లీగల్‌ ప్రొసీడింగ్స్‌ పూర్తి చేసి నగదును బాధితుల ఖాతాల్లో మంగళవారం జమ చేయించామని డీసీపీ కవిత వెల్లడించారు.

city6.2.jpg


- నగరానికి చెందిన ఓ వృద్ధుడికి సైబర్‌ నేరగాళ్లు ఇటీవల ఫోన్‌ చేశారు. మీ పోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేస్తున్నామని, మీ మీద క్రిమినల్‌ కేసు నమోదైందని సీబీఐ అధికారుల్లా మాట్లాడి భయపెట్టారు. మనీల్యాండరింగ్‌లో మీ హస్తం ఉందని, బ్యాంకు ఖాతా తనిఖీ చేయాలని బెరించి రూ. 8,05,331 కాజేశారు. బాధితుడు వెంటనే సిటీసైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

- ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని సైబర్‌ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ.13.5 లక్షలు కాజేశారు. బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించి సైబర్‌ నేరగాళ్ల ఖాతాలను స్తంభింపజేసి డబ్బును రికవరీ చేశారు.


ఇదికూడా చదవండి: Harish Rao: ఫీజుల చెల్లింపుల్లో సర్కారు నిర్లక్ష్యం

ఇదికూడా చదవండి: Mulugu: కాటేసిన పాము, కరెంటు!

ఇదికూడా చదవండి: విద్యుత్తు శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్‌

ఇదికూడా చదవండి: Investment Scam: స్టాక్‌ బ్రోకింగ్‌ పేరుతో.. ఘరానా మోసం!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 09 , 2024 | 11:17 AM