Share News

Mohammed Siraj: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిరాజ్.. ఆ రెండు ఇవ్వాలని నిర్ణయం

ABN , Publish Date - Jul 09 , 2024 | 06:18 PM

టీ20 వరల్డ్‌కప్ విన్నర్ మహమ్మద్ సిరాజ్ మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ గెలిచినందుకు సిరాజ్‌కు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అంతేకాదు..

Mohammed Siraj: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిరాజ్.. ఆ రెండు ఇవ్వాలని నిర్ణయం
Mohammed Siraj

టీ20 వరల్డ్‌కప్ విన్నర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ గెలిచినందుకు సిరాజ్‌కు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అంతేకాదు.. భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను సిరాజ్‌కు నగరంలో ఓ ఇంటిస్థలం ఇవ్వడంతో పాటు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అటు.. సిరాజ్ టీమిండియా జెర్సీని సీఎంకి బహూకరించాడు.


ఇదిలావుండగా.. టీ20 వరల్డ్‌కప్ సాధించిన భారత జట్టులో మహమ్మద్ సిరాజ్ ఉన్న విషయం తెలిసిందే. అమెరికా వేదికగా జరిగిన తొలి మూడు మ్యాచ్‌ల్లో అతడు తుది జట్టులో ఉన్నాడు. అయితే.. వెస్టిండీస్‌కు వేదిక షిఫ్ట్ అయ్యాక అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు. అక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో.. సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ని తీసుకోవడం జరిగింది. ఆ మూడు మ్యాచ్‌ల్లో సిరాజ్ ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అయితే.. స్పెల్ మాత్రం బాగా వేశాడు. భారీ పరుగులు ఇవ్వకుండా, కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి తన సత్తా చాటాడు.


మరోవైపు.. వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడు సిరాజ్‌కు ఘనస్వాగతం లభించింది. అభిమానులు అతనికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అది చూసి ఉప్పొంగిపోయిన సిరాజ్.. తానూ వాహనంపై ఓపెన్ టాప్ తీసి పాట పాడారు. డ్యాన్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం నింపారు. కాగా.. సీఎం రేవంత్‌ని సిరాజ్ కలిసిన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజహరుద్దీన్‌ కూడా పాల్గొన్నారు.

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 06:18 PM