Share News

MP Eetala: మీ కాలుకు ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా..

ABN , Publish Date - Jun 18 , 2024 | 11:20 AM

మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికి ఎల్లప్పుడు ముందుంటానని ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) అన్నారు. బీజేపీ వనస్థలిపురం డివిజన్‌ అధ్యక్షుడు నూతి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్‌కు అభినందన కార్యక్రమాన్ని ఎఫ్‌సీఐ కాలనీలో నిర్వహించారు.

MP Eetala: మీ కాలుకు ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా..

- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌

హైదరాబాద్: మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికి ఎల్లప్పుడు ముందుంటానని ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) అన్నారు. బీజేపీ వనస్థలిపురం డివిజన్‌ అధ్యక్షుడు నూతి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్‌కు అభినందన కార్యక్రమాన్ని ఎఫ్‌సీఐ కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఈటల మాట్లాడుతూ నా విజయాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించవచ్చన్నారు. డబ్బు, మద్యాన్ని నమ్ముకున్న వారికి నా విజయం చెంపపెట్టు అన్నారు. మాట ఇచ్చినవాళ్లే గెలిపించినారని, ఓటర్లే నాకు ఓనర్లు అన్నారు. విశ్వాసం, నమ్మకం నామీద ఏవిధంగా పెట్టి గెలిపించారో అదేవిధంగా మీ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. ఎక్కడ సమస్యలున్నా పరిష్కరించడమే నా కర్తవ్యం అన్నారు. పిలుస్తే పలికే నాయకుడినని, మీ కాలుకు ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మూడు సంవత్సరాల తర్వాత ఆర్టీసీ బస్సు పునఃప్రారంభం..


రాజకీయ నాయకులకు ప్రజలే వీఐపీలు అని, నా మాటలు, చేతలు కొత్తవి కావన్నారు. తాము అనుభవించే పదవులు రాజ్యాంగం కల్పించిన పదవులే అన్నారు. ఎన్నికల వరకే పార్టీలని, అనంతరం అందరూ సమానమేనని తెలిపారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాడిని తనకు సమస్యలు లెక్కకాదన్నారు. ఎల్బీనగర్‌లో త్వరలోనే అభివృద్ధి పనుల ప్రక్రియ మొదలుపెడతామని ఆయన తెలిపారు. అంతకు ముందు మన్సూరాబాద్‌లోని ఎంఇరెడ్డి గార్డెన్స్‌లో కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, నాయకులు కాచం వెంకటేశ్వర్లు, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, రవీందర్‌గౌడ్‌, అంజన్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 11:20 AM