Share News

MP Etala: పేదల ఇళ్లజోలికొస్తే ఖబడ్దార్‌.. రేవంత్‌రెడ్డి సర్కారు ఎప్పుడు కూలుతుందో..

ABN , Publish Date - Oct 26 , 2024 | 08:50 AM

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లజోలికొస్తే సహించేది లేదు ఖబడ్దార్‌ అంటూ బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(BJP Malkajigiri MP Etala Rajender) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూల్చివేతలను అడ్డుకుని తీరతామన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు శని, ఆదివారాలు వస్తే బిక్కుబిక్కుమని జీవితాలు గడిపే దుస్థితి నెలకొందన్నారు.

MP Etala: పేదల ఇళ్లజోలికొస్తే ఖబడ్దార్‌.. రేవంత్‌రెడ్డి సర్కారు ఎప్పుడు కూలుతుందో..

- ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఈటల

హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లజోలికొస్తే సహించేది లేదు ఖబడ్దార్‌ అంటూ బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(BJP Malkajigiri MP Etala Rajender) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూల్చివేతలను అడ్డుకుని తీరతామన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు శని, ఆదివారాలు వస్తే బిక్కుబిక్కుమని జీవితాలు గడిపే దుస్థితి నెలకొందన్నారు. పట్టాలు ఉన్న ఇళ్లను ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. కనీసం ఇళ్లలోని సామాన్లు తీసుకుపోవడానికి సమయం ఇవ్వకుండా కూల్చివేయడం అత్యంత దారుణమన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో బీజేపీ రాష్ట్ర కమిటీ మహాధర్నా నిర్వహించింది.

ఈ వార్తను కూడా చదవండి: Jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు


ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్‏రెడ్డి, వెంకటరమణారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, బంగారు శృతి, దుగ్యాల ప్రదీప్‏కుమార్‌, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌, ధర్మారావు, ఎన్‌వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్‌నాయక్‌, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్‌ ఫాషా, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్‌, కార్పొరేటర్లు నాయకులు, కార్యకర్తలు, మూసీ బాధితులు పాల్గొన్నారు.


రేవంత్‌రెడ్డి సర్కారు ఎప్పుడు కూలుతుందో..

ఎంపీ ఈటల మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ ఆందోళనలతో హైడ్రా తోకముడిచిందన్నారు. రివర్‌ బెడ్‌ అంటూ దొంగల్లాగా రంగులు వేశారని, రేవంత్‌రెడ్డికి దమ్ముంటే లక్షన్నర కోట్లు ఎలా తెస్తాడో, ఎప్పుడు తెస్తాడో చెప్పాలని సవాల్‌ విసిరారు. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కారు ఏ సమయంలో కూలిపోతుందో తెలియదని ఆరోపించారు.

city2.2.jpg


బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ లంకెబిందెలు ఖాళీగా ఉన్నాయని రేవంత్‌ అన్నారని, అవి మూసీనదిలో ఉన్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలోనే ఆ ఇళ్లకు అనుమతి ఇచ్చారని, ఇప్పుడు ఎలా అక్రమమయ్యాయో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కమీషన్లు, అక్రమ సంపాదన కోసం పేదల ఇళ్లను కూలిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రేవంత్‌ సర్కారుకు పేదల భూములే కనిపిస్తున్నాయా, ఎంఐఎం నేతల భూములు కనిపించడం లేదా ప్రశ్నించారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కేటీఆర్‌లో వణుకు మొదలైంది: ఆది శ్రీనివాస్‌

ఈవార్తను కూడా చదవండి: Winter Weather: వణికిస్తున్న చలి పులి..!

ఈవార్తను కూడా చదవండి: jaggareddy: ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి

ఈవార్తను కూడా చదవండి: Kidnap: సంగారెడ్డి ఆస్పత్రిలో కిడ్నాప్.. సంచలనం రేపుతున్న ఘటన..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 26 , 2024 | 08:50 AM