Share News

TG Politics: శ్రీరామ కళ్యాణ మహోత్సవంపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 07:35 PM

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలో రేపు(బుధవారం) జరిగే శ్రీరామ కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) నిలిపివేసింది. కళ్యాణాన్ని ఈసీ నిలిపివేయడంతో ఈ చర్యలను రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. ఈ మేరకు మంగళవారం నాడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని వివరించారు.

TG Politics: శ్రీరామ కళ్యాణ మహోత్సవంపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలో రేపు(బుధవారం) జరిగే శ్రీరామ కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) నిలిపివేసింది. కళ్యాణాన్ని ఈసీ నిలిపివేయడంతో ఈ చర్యలను రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. ఈ మేరకు మంగళవారం నాడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని వివరించారు.


MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరోసారి చుక్కెదురు.. అప్పటివరకు!

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... శ్రీరామ కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారంపై ఈసీ ఆంక్షలు పెట్టిందన్నారు. ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని ఈసీను కోరామన్నారు. శ్రీరామ కళ్యాణాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని సూచించారు. లైవ్ తెలికాస్ట్ అనేది 45 ఏళ్లుగా కొనసాగుతుందని తెలిపారు. 45 ఏళ్లలో అనేక ఎన్నికలు వచ్చాయని చెప్పారు. శ్రీరామ నవమి కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు.


Telangana: నల్గొండలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మార్పు.. కొత్తగా ఎవరంటే?

శ్రీరామ నవమి లైవ్ కవరేజ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై అనుమానం కలుగుతోందన్నారు. తూతూ మంత్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి అడిగిందని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా శ్రీరాముడినీ దూరం పెట్టాలని అన్నారని చెప్పారు. శ్రీరాముడిని దూరం పెట్టిన కేసీఆర్‌కు అధికారం దూరం చేశారని చెప్పారు. ప్రజల కోరిక మేరకు ఈసీ సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. అవసరం అయితే పార్టీ పరంగా కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. శ్రీరామ కళ్యాణ మహోత్సవాలను రాజకీయాలతో రాష్ట్ర ప్రభుత్వం ముడిపెడుతోందని లక్ష్మణ్ అన్నారు.


Akbaruddin Owaisi: మా బ్రదర్స్‌ను చంపాలని చూస్తున్నారు.. అక్బరుద్దీన్ సంచలనం!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 07:49 PM