Share News

Crime News: తిర్మలాపూర్‌లో దారుణం.. మామతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ABN , Publish Date - Jun 23 , 2024 | 04:16 PM

బాన్సువాడ(Banswada) మండలం తిర్మలాపూర్‌(Tirmalapur)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త రాములును మామ నారాయణతో కలిసి భార్య మంజుల హత్య చేసింది. గొడ్డలితో దారుణంగా నరికి చంపి ఇంటి వెనక గోతిలో పాతిపెట్టారు.

Crime News: తిర్మలాపూర్‌లో దారుణం.. మామతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

కామారెడ్డి: బాన్సువాడ(Banswada) మండలం తిర్మలాపూర్‌ (Tirmalapur)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త రాములును మామ నారాయణతో కలిసి భార్య మంజుల హత్య చేసింది. గొడ్డలితో దారుణంగా నరికి చంపి ఇంటి వెనక గోతిలో పాతిపెట్టారు. అనంతరం భర్త కనిపించడం లేదని మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి వెనక గోతిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. గోతిని తవ్వి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం నిందితులు మామ నారాయణ, భార్య మంజులను అదుపులోకి తీసుకున్నారు. రాములు జులాయిగా తిరుగుతూ రోజూ వేధించడం వల్లే హత్యకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Updated Date - Jun 23 , 2024 | 04:16 PM