Share News

Petbashirabad : ‘రేవంత్‌ అంకుల్‌.. వీధి కుక్కల నుంచి కాపాడండి’

ABN , Publish Date - Jul 22 , 2024 | 02:35 AM

వీధి కుక్కల బారి నుంచి రక్షించండంటూ హైదరాబాద్‌కు చెందిన పలువురు చిన్నారులు రోడ్డెక్కారు. రేవంత్‌ అంకుల్‌ (సీఎం రేవంత్‌ రెడ్డి) మమ్మల్ని కాపాడండి..

 Petbashirabad : ‘రేవంత్‌ అంకుల్‌.. వీధి కుక్కల నుంచి కాపాడండి’

  • హైదరాబాద్‌ పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌ ఎదుట చిన్నారుల నిరసన

  • కొంపల్లి పురపాలక కమిషనర్‌పై పోలీసులకు ఫిర్యాదు

పేట్‌బషీరాబాద్‌, జూలై 21(ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల బారి నుంచి రక్షించండంటూ హైదరాబాద్‌కు చెందిన పలువురు చిన్నారులు రోడ్డెక్కారు. రేవంత్‌ అంకుల్‌ (సీఎం రేవంత్‌ రెడ్డి) మమ్మల్ని కాపాడండి..

అంటూ నినాదాలు చేస్తూ పోలీసుస్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. అంతేనా.. వీధి కుక్కల సమస్యను పరిష్కరించని తమ ప్రాంత పురపాలక సంఘం కమిషనర్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

వీధి కుక్కల సమస్య తీవ్రతను చూపెట్టే ఈ ఘటన హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌ వద్ద ఆదివారం జరిగింది. హైదరాబాద్‌, కొంపల్లి పురపాలక సంఘం పరిధి ఎన్‌సీఎల్‌ నార్త్‌ కాలనీకి చెందిన చిన్నారులు ఈ పని చేశారు.

‘రేవంత్‌ అంకుల్‌, కమిషనర్‌ అంకుల్‌, వివేక్‌ అంకుల్‌(స్థానిక ఎమ్మెల్యే వివేకానంద) మా ప్రాణాలకు రక్షణ ఏదీ ?’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని తల్లిదండ్రులతో కలిసి ర్యాలీగా పోలీసుస్టేషన్‌కు వచ్చి నిరసన తెలిపారు. పురపాలక సంఘం కమిషనర్‌ శ్రీహరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jul 22 , 2024 | 02:35 AM