Share News

Police Union: పోలీస్‌ అధికారుల సంఘాన్ని రద్దు చేయండి..

ABN , Publish Date - Jul 16 , 2024 | 03:08 AM

తాత్కాలికంగా కొనసాగుతున్న పోలీస్‌ అధికారుల సంఘాన్ని రద్దు చేసి, కొత్త సంఘం కోసం ఎన్నికలు నిర్వహించాలని సంఘం రాష్ట్ర మాజీ కోషాధికారి, పీటీవో ఉపాధ్యక్షుడు జీఎస్‌ రాజు తదితరులు విజ్ఞప్తి చేశారు.

Police Union: పోలీస్‌ అధికారుల సంఘాన్ని రద్దు చేయండి..

  • కొత్త సంఘం కోసం ఎన్నికలు నిర్వహించండి

  • డీజీపీకి సంఘం సభ్యుల వినతి

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): తాత్కాలికంగా కొనసాగుతున్న పోలీస్‌ అధికారుల సంఘాన్ని రద్దు చేసి, కొత్త సంఘం కోసం ఎన్నికలు నిర్వహించాలని సంఘం రాష్ట్ర మాజీ కోషాధికారి, పీటీవో ఉపాధ్యక్షుడు జీఎస్‌ రాజు తదితరులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ఆధ్వర్యంలో సంఘం ప్రస్తుత, మాజీ సభ్యులు పలువురు సోమవారం డీజీపీ జితేంతర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సిబ్బంది ఆరోగ్య భద్రతకు సంబంధించి సుమారు రూ. 260 కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయని, దాంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో పోలీస్‌ సిబ్బందికి చికిత్స నిరాకరిస్తున్నారని ఈ సందర్భంగా వారు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.


సుమారు 1,288 మంది సివిల్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు ఏఎస్సై పదోన్నతి కోసం వేచి చూస్తున్నారని, ఆ ఫైల్‌ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు. పీటీవోలో సుమారు 15 సంవత్సరాలుగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయిందని, అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ దశల వారిగా పరిష్కరించాలని డీజీపీని వారు కోరారు.

Updated Date - Jul 16 , 2024 | 03:08 AM