Share News

RTC Workers: ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 31 , 2024 | 03:42 AM

సుదీర్ఘకాలంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఎస్‌ ఆర్టీసీఎ్‌సడబ్ల్యూయూ(ఐఎన్‌టీయూసీ) ప్రతినిధి బృందం బుధవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించింది.

RTC Workers: ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలి

  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబుకు ఎస్‌డబ్ల్యూయూ ప్రతినిధుల వినతి

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : సుదీర్ఘకాలంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఎస్‌ ఆర్టీసీఎ్‌సడబ్ల్యూయూ(ఐఎన్‌టీయూసీ) ప్రతినిధి బృందం బుధవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించింది. అలాగే కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబును కలిసి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందించినట్టు టీజీఎ్‌సఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ(ఐఎన్‌టీయూసీ) ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శి డి.గోపాల్‌, కార్యదర్శులు కేటీ.రెడ్డి, టీఎ్‌స.రెడ్డి తెలియజేశారు.ఈ సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చినట్టు రాజిరెడ్డి తెలిపారు.

Updated Date - Oct 31 , 2024 | 03:42 AM