Home » Duddilla Sridhar Babu
తెలంగాణాను త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్‌కు ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’గా మారుస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఇప్పటికే సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ పరిశోధన, అభివృద్ధిలో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రానికి.. సిలికాన్ వ్యాలీ సంస్థలను తీసుకొస్తామన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై సోషల్ మీడియాలో ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నేత చల్లా నారాయణరెడ్డిపై ఆదివారం కేసు నమోదైందని భూపాలపల్లి జిల్లా కాటారం ఎస్సై అభినవ్ తెలిపారు.
రాష్ట్రంలో రెండో స్థానం కోసం బీఆర్ఎస్, బీజేపీ పోటీపడుతూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి తుమ్మల పుట్టినరోజు సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సచివాలయంలో శుక్రవారం ఆయన్ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆటోమోటివ్, విద్యుత్తు వాహనాల తయారీలో ఉపయోగించే మ్యాగ్నెటిక్, సెన్సర్లు, చిప్‌ల తయారీలో దిగ్గజ సంస్థ అయిన అలెగ్రో మైక్రోసిస్టమ్స్... హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
రైతులను బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు గురి చేస్తున్నారని మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. రైతు సమస్యలను తమ ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని రైతులు ఆందోళన పడవద్దని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత గత 11 నెలల్లో 140 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 36వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కోన్నారు.
ఫార్మా పరిశ్రమ ఏర్పాటుపై లగచర్లలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై కుట్రపూరితంగా దాడులు చేశారని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా అన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మా రంగంలోని దిగ్గజ కంపెనీలు ముందుకువచ్చాయి. ఇందులో డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటెరో, ఎంఎ్‌సఎన్, లారస్ కంపెనీలున్నాయి.
‘‘దేశంలో సామాజిక న్యాయం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం పోరాటం సాగిస్తున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పనిచేసేది