Share News

Special trains: ఓనం సందర్భంగా కేరళకు ప్రత్యేక రైళ్లు...

ABN , Publish Date - Sep 11 , 2024 | 12:41 PM

కేరళ(Kerala)లో ఓనం పండగ సందర్భంగా ఈనెల 13, 14 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 13న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station) నుంచి(07119) ఓనం ప్రత్యేక రైలు సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, రేణిగుంట(Nalgonda, Miryalaguda, Guntur, Renigunta), కోయంబత్తూర్‌, ఎర్నాకులం మీదు గా కొల్లాం వెళ్తుంది.

Special trains: ఓనం సందర్భంగా కేరళకు ప్రత్యేక రైళ్లు...

సికింద్రాబాద్: కేరళ(Kerala)లో ఓనం పండగ సందర్భంగా ఈనెల 13, 14 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 13న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station) నుంచి(07119) ఓనం ప్రత్యేక రైలు సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, రేణిగుంట(Nalgonda, Miryalaguda, Guntur, Renigunta), కోయంబత్తూర్‌, ఎర్నాకులం మీదు గా కొల్లాం వెళ్తుంది. ఈనెల 14న సాయంత్రం 4 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్‌(Kachiguda Railway Station) నుంచి(07044) ప్రత్యేక రైలు మహబూబ్‌నగర్‌, కర్నూలు, గుత్తి, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరు, ఎర్నాకులం, కొట్టాయం, చెంగనూరు మీదుగా కొల్లాం జంక్షన్‌కు చేరుకుంటుంది.

ఇదికూడా చదవండి: Hyderabad: ఆశకు పోతే ఉన్నది ఊడ్చేశారు..


ప్రయాగ్‌రాజ్‌ - బెంగళూరు మధ్య

ప్రయాగ్‌రాజ్‌-ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య ఆది, బుధవారాల్లో అక్టోబరు13 నుంచి నవంబరు 20 వరకు 12 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అలాగే అక్టోబరు 29, నవంబరు 5వ తేదీన ఎల్‌టీటీ ముంబై-కరీంనగర్‌ల మధ్య ప్రత్యేక రైలు(01067), అక్టోబరు 30, నవంబరు 6న కరీంనగర్‌-ఎల్‌టీటీ ముంబైల మధ్య ప్రత్యేక రైలు(01068) నడవనుంది.


.............................................................

ఈ వార్తను కూడా చదవండి:

.............................................................

Konda Surekha: అటవీశాఖలో త్వరలో నియామకాలు..

- అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్‌: దేశ రక్షణకు సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడుతూ సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే, సహజవనరులైన అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినం సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘విధి నిర్వహణలో 22 మంది అటవీశాఖ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.

city8.jpg


వన మహోత్సవం ద్వారా అటవీ సంపదను 24 శాతం నుంచి 33 శాతానికి పెంచే మహా యజ్ఞంలో ఉద్యోగులు, సిబ్బంది కంకణబద్ధులై ఉన్నారు. అటవీ శాఖ బలోపేతానికి అవసరమైన ఉద్యోగులు, సిబ్బంది నియామకంపై కసరత్తు చేస్తున్నాం. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా, అడవుల నరికివేతను అడ్డుకునే దిశగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 11 , 2024 | 12:41 PM