Share News

Srisailam: శ్రీశైలం నుంచి నీటి తరలింపు ఆపండి

ABN , Publish Date - Nov 09 , 2024 | 04:16 AM

శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లోలు తగ్గినందున.. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును నిలిపివేయాలని ఏపీ సర్కారును తెలంగాణ నీటిపారుదల శాఖ కోరింది.

Srisailam: శ్రీశైలం నుంచి నీటి తరలింపు ఆపండి

  • ఏపీ సర్కారు సహా ఇరు రాష్ట్రాల జెన్‌కోలకు తెలంగాణ నీటి పారుదల శాఖ లేఖ

హైదరాబాద్‌, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లోలు తగ్గినందున.. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును నిలిపివేయాలని ఏపీ సర్కారును తెలంగాణ నీటిపారుదల శాఖ కోరింది. అలాగే, ప్రాజెక్టుకు ఇరువైపులా ఉన్న కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తిని ఆపేయాలని విజ్ఞప్తి చేసింది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) కూడా స్పందించింది.


అవసరం లేకున్నా పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును అడ్డుకోవాలని, శ్రీశైలం, సాగర్‌లో జలవిద్యుత్‌ ఉత్పాదనను నిలిపివేయాలని కోరింది. తాజాగా తెలంగాణ నీటిపారుదల శాఖ కూడా ఈ అంశంపై స్పందించింది. తాగు, సాగు నీటి అవసరాల కోసం శ్రీశైలంలో నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ తెలంగాణ ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌ శుక్రవారం తెలంగాణ జెన్‌కోతో పాటు ఏపీ జలవనరుల శాఖ, ఏపీ జెన్‌కోకు లేఖ రాశారు. తక్షణమే పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును నిలిపివేసి, జలవిద్యుత్‌ ఉత్పాదనను ఆపాలని కోరారు.

Updated Date - Nov 09 , 2024 | 04:16 AM