Share News

Hyderabad: నేటితో ముగియనున్న వీసీల పదవీకాలం

ABN , Publish Date - May 21 , 2024 | 02:59 AM

రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల పదవీకాలం మంగళవారం (21వ తేదీ)తో ముగియనుంది. కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇన్‌చార్జి వీసీలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీల వీసీల ఎంపిక కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

Hyderabad: నేటితో ముగియనున్న వీసీల పదవీకాలం

  • మొదలవ్వని సెర్చ్‌ కమిటీల భేటీలు

  • ప్రక్రియ పూర్తయ్యేదాకా ఇన్‌చార్జిలే!

  • హడావుడిగా పాత బిల్లుల చెల్లింపు

  • మూడేళ్లు ఆపి ఇప్పుడు మంజూరు

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల పదవీకాలం మంగళవారం (21వ తేదీ)తో ముగియనుంది. కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇన్‌చార్జి వీసీలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీల వీసీల ఎంపిక కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ వీసీ పోస్టులకు మొత్తం 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకుంటే అన్ని యూనివర్సిటీలకు కలిపి 1,382 దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి, వీసీల పేర్లను సిఫారసు చేయడం కోసం సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలవ్వడంతో వీసీల నియామకంలో కొంత జాప్యం జరిగింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్నాక నాలుగు రోజుల క్రితమే సర్కారు సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది.


అయితే కమిటీల సమావేశాలు ఇంకా జరగలేదు. ఫలితంగా కొత్త వీసీల నియామకానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు ఆయా యూనివర్సిటీలకు ఇన్‌చార్జిలను నియమించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ఇన్‌చార్జిలుగా ఐఏఎస్‌ అధికారులను నియమించే అవకాశం కనిస్తోంది. కాగా, తమ పదవీకాలం ముగుస్తుండటంతో పలు యూనివర్సిటీల వీసీలు హడావుడిగా బిల్లులను క్లియర్‌ చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. గత మూడేళ్లుగా కొనసాగుతున్న వీసీలు తమ పదవీకాలం చివరి దశలో ఇలా పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా, జేఎన్‌ఏఎ్‌ఫఏ వంటి పలు యూనివర్సిటీల్లో రూ.కోట్లలో పాత బిల్లులను చెల్లించినట్టు తెలిసింది.


బిష్కెక్‌లో భారతీయ విద్యార్థులు క్షేమం

కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరిగిన ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు సీఎం సూచన మేరకు అధికారులు బిష్కెక్‌లోని భారత రాయభారి అరుణ్‌ కుమార్‌ చటర్జీని సంప్రదించి వివరాలను సేకరించారు. భారతీయ విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులకు చటర్జీ చెప్పారు.


రెవెన్యూశాఖలో పదోన్నతులకు డీపీసీ ఏర్పాటు

రెవెన్యూశాఖలో అర్హులైన అధికారులకు పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ)ని నియమించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌మిత్తల్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కమిటీకి చైౖర్‌పర్సన్‌ లేదా కన్వీనర్‌గా సీసీఎల్‌ఏ (చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌), మెంబర్లుగా కమిషనర్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్స్‌జ్‌ నుంచి ఒకరు, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ నుంచి డిప్యూటీ సెక్రటరీ లేదా జాయింట్‌ సెక్రటరీ ఉండనున్నారు.

Updated Date - May 21 , 2024 | 02:59 AM