Share News

Tiger Footprints: ఆసిఫాబాద్‌ జిల్లాలో పులి సంచారం

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:50 AM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని గుండి, గోవిందాపూర్‌ గ్రామాల సమీపంలో సోమవారం పులి అడుగులను గ్రామస్థులు గుర్తించారు.

Tiger Footprints: ఆసిఫాబాద్‌ జిల్లాలో పులి సంచారం

ఆసిఫాబాద్‌, ఆగస్టు 5 : కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని గుండి, గోవిందాపూర్‌ గ్రామాల సమీపంలో సోమవారం పులి అడుగులను గ్రామస్థులు గుర్తించారు. వ్యవసాయ భూముల్లో పులి అడుగులు కనిపించడంతో రైతులు అఽధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న డిప్యూటీ రేంజ్‌ అధికారి యోగేష్‌, ఏఎస్సై రాములు పులి అడుగులను పరిశీలించారు.


పులి మండలంలోని గుండి గ్రామం మీదుగా గోవిందాపూర్‌ వరకు సంచరించినట్లు అడుగుల ద్వారా గుర్తించారు. కొంతకాలంగా అంకుశాపూర్‌ గ్రామపరిధిలోని కెనాల్‌ ప్రాంతంలో కనిపిస్తున్న పులి జిల్లాకేంద్రం వైపు వచ్చిందా లేదా కొత్త పులి జిల్లాకు వచ్చిందా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.

Updated Date - Aug 06 , 2024 | 04:50 AM