Share News

Gadwal: ఇద్దరు దళిత బాలికలపై లైంగిక దాడి

ABN , Publish Date - Sep 09 , 2024 | 03:11 AM

జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇద్దరు దళిత బాలికలు లైంగిక దాడికి గురయ్యారు.

Gadwal: ఇద్దరు దళిత బాలికలపై లైంగిక దాడి

  • గద్వాల జిల్లాలో ఇద్దరు యువకుల కిరాతకం

గద్వాల క్రైం, సెప్టెంబరు 8: జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇద్దరు దళిత బాలికలు లైంగిక దాడికి గురయ్యారు. మాయమాటలు చెప్పి ద్విచక్రవాహనాలపై వాళ్లని తీసుకెళ్లిన ఇద్దరు యువకులు.. బాలికలను బెదిరించి అరాచకానికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులు, వారికి సహకరించిన మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబాలు, పోలీసుల కథనం ప్రకారం.. గద్వాల మండలానికి చెందిన ఇద్దరు బాలికలు గద్వాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఎప్పట్లాగే శుక్రవారం ఉదయం పాఠశాలకు బయలుదేరిన ఆ బాలికలు స్కూలుకు చేరలేదు.


పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని ఆ రోజు మధ్యాహ్నమే తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే, సాయంత్రానికి ఇంటికి తిరిగొచ్చిన బాలికలను తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన ఘోరం బయటపడింది. బాలికలను గ్రామ స్టేజీ సమీపంలో ఆపిన ఇద్దరు యువకులు తాము దిగబెడతామని చెప్పి వాళ్లని బైక్‌లు ఎక్కించుకున్నారు. వ్యక్తిగత ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టి వైరల్‌ చేస్తామని బెదిరించి ఓ గదికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. కాగా, సదరు యువకులతోపాటు మరో నలుగురు.. బాధిత బాలికల ఇళ్ల సమీపంలో శనివారం హల్‌చల్‌ చేశారు. దీంతో బాధితులు ఆదివారం పోలీసులను ఆశ్రయించగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Sep 09 , 2024 | 03:11 AM