TG News: ‘రేవంతన్నా నీ పౌరుషం ఏమైంది’.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..!
ABN , Publish Date - Aug 29 , 2024 | 09:25 PM
కవితకు బెయిల్, హైడ్రా వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక కామెంట్స్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. కవిత బెయిల్‌పై తాను మాట్లాడలేదన్నారు. కవిత అడ్వకేట్ గురించే మాట్లాడానని అన్నారు. రాజ్యసభ అభ్యర్థి గెలుపు కోసం...
హైదరాబాద్, ఆగష్టు 29: కవితకు బెయిల్, హైడ్రా వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక కామెంట్స్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. కవిత బెయిల్‌పై తాను మాట్లాడలేదన్నారు. కవిత అడ్వకేట్ గురించే మాట్లాడానని అన్నారు. రాజ్యసభ అభ్యర్థి గెలుపు కోసం బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందని మరోసారి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని.. ఆ విషయం మాత్రమే చెప్పానన్నారు. కోర్టు తీర్పులపై జాగ్రత్తగా మాట్లాడాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.
కేటీఆర్ అమెరికా వెళ్లారని.. రేపో మాపో సింగపూర్ మీదుగా కాంగ్రెస్ నేతలు కూడా వెళ్తారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో హైడ్రా పని తీరుపైనా కీలక వ్యాఖ్యలు చేశారాయన. అన్ని భూ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఒక్క ఎన్ కన్వెన్షన్ మాత్రమే కూల్చి మిగతావి వదిలేయొద్దన్నారు. పెద్దోడిని, పేదోడిని ఒకేలా చూడొద్దన్నారు. పేద ప్రజల పట్ల సానుకూలంగా ఉండాలన్నారు. జన్వాడ ఫామ్ హౌజ్ ఎందుకు కూల్చడం లేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
రేవంతన్నా నీ పౌరుషం ఏమంది?
రేవంతన్నా నీ పౌరుషం ఏమంది అని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఓవైసి కబ్జాపై ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. ఓవైసీ కాలేజీ విద్యార్థులను వేరే కాలేజీకి సర్దుబాటు చేయాలన్నారు. చెయ్యేస్తే సంగతి చెప్తా అన్న ఒవైసీకి రేవంత్ భయపడ్డారా? అని ప్రశ్నించారు. మిగతా కాలేజీలకు నోటీసులిచ్చి ఒవైసీ కాలేజీకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని.. రుణమాఫీ సంగతి ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్రమంత్రి బండి సంజయ్ నిలదీశారు.