Share News

Hyderabad: ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ

ABN , Publish Date - Aug 22 , 2024 | 07:02 PM

తెలంగాణలో ఇటీవల ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా గత వారం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్‌ భారీగా ‌లంచం తీసుకుంటు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన విషయం విధితమే.

Hyderabad: ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ

హైదరాబాద్, ఆగస్ట్ 22: ఏసీబీ వలలో మరో అవినీతి చాప చిక్కింది. వనస్థలిపురం సూపరిండెంట్ కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ డివిజనల్ ఇంజనీర్ రామ్మోహన్ నాయుడు గురువారం ఏసీబీకి చిక్కారు. రూ.18 వేలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు డి.ఈ పట్టుబడ్డారు.

తెలంగాణలో ఇటీవల ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా గత వారం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్‌ భారీగా ‌లంచం తీసుకుంటు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన విషయం విధితమే.

Also Read: Hyderabad City: నడి రోడ్డుపై యువకుడి నిర్వాకం.. ఏం చేశాడంటే..?


అలాగే లంచాల రూపంలో గతంలో వందలు, వేల రూపాయిల్లో చేతులు మారేవి. కానీ నేడు అవి కాస్తా.. లక్షలు, కోట్ల రూపాయిల రూపంలో చేతులు మారుతున్నాయి. అదీకాక.. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.

Also Read: Beerla Ilaiah: ‘రైతు రుణ మాఫీ చూసి బీఆర్ఎస్ నేతల మతి భ్రమించింది’


అలాగే కొత్త ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం బేగంపేటలోని ప్రజా‌భవన్‌ను ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు భారీగా లంచాలు డిమాండ్లు చేస్తున్నారంటూ.. సామాన్య ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తినట్లు ఉన్నతాధికారుల పరిశీలనలో తెలిందని సమచారం.

Also Read: అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు


ఈ సందర్బంగా ఏసీబీని వారు అప్రమత్తం చేసినట్లు ఓ ప్రచారం సైతం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి. వివిధ శాఖల కార్యాలయాలపై ఆకస్మిక దాడులకు దిగుతున్నారు. ఆ క్రమంలో ఉన్నత స్థాయి అధికారుల నుంచి కార్యాలయంలోని అటెండర్ వరకు అందరి వద్ద భారీగా నగదు పట్టుబడినట్లు తెలుస్తుంది.

Also Read: Ayodhya: ఎస్పీ నేతకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘మార్క్ ట్రీట్‌మెంట్’


ఇదే తరహాలో గురువారం వనస్థలిపురంలోని విద్యుత్ శాఖ సూపరిండెంట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ.. డీ ఈ రామ్మోహన్ నాయుడు ఏసీబీకి అడ్డంగా దొరికిపోవడం గమనార్హం.

Read More Telangana News and atest Telugu News

Updated Date - Aug 22 , 2024 | 07:02 PM