Share News

Vijaya Bharati (NHRC) : దేశంలో ఏటా లక్ష మంది మహిళల మిస్సింగ్‌

ABN , Publish Date - Jul 22 , 2024 | 03:44 AM

దేశంలో ఏటా లక్ష మంది అమ్మాయిలు, మహిళలు కనిపించకుండా పోతున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్‌పర్సన్‌ విజయభారతి తెలిపారు. ఈ కేసుల పరిష్కారానికి ఎన్‌హెచ్‌ఆర్సీ పని చేస్తోందని, ప్రభుత్వ వర్గాలు పట్టించుకోకున్నా బాధితులకు బాసటగా నిలుస్తోందన్నారు.

 Vijaya Bharati (NHRC) : దేశంలో ఏటా లక్ష మంది మహిళల మిస్సింగ్‌

  • ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్‌ విజయభారతి

పరిగి, జూలై 21: దేశంలో ఏటా లక్ష మంది అమ్మాయిలు, మహిళలు కనిపించకుండా పోతున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్‌పర్సన్‌ విజయభారతి తెలిపారు. ఈ కేసుల పరిష్కారానికి ఎన్‌హెచ్‌ఆర్సీ పని చేస్తోందని, ప్రభుత్వ వర్గాలు పట్టించుకోకున్నా బాధితులకు బాసటగా నిలుస్తోందన్నారు.

ఈ మిస్సింగ్‌ కేసులకు సంబంధించి అన్నిరాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులకు పూర్తిస్థాయి నివేదికలు పంపాలని ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ఆదివారం పరిగిలోని శ్రీసరస్వతీ శిశు మందిర్‌లో మాతృభూమి ఫౌండేషన్‌, ప్రముఖ రచయిత డాక్టర్‌ పి.భాస్కరయోగి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ మహోత్సవానికి విజయభారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

మానవ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతీ పౌరుడిపై ఉందన్నారు. దేశంలో అణగారిన వర్గాల హక్కులపై అణచివేత ధోరణి ఇంకా కొనసాగుతోందని, పశ్చిమబెంగాల్‌లో వివక్ష ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వివక్షకు సంబంధించి రోజుకు 500 లకుపైగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. డాక్టర్‌ భాస్కరయోగి రాసిన ‘మన పండుగలు’ పుస్తకాన్ని ఈ సందర్భంగా విజయభారతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాద్‌రావు, జిల్లా అఽధ్యక్షుడు కె.మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2024 | 03:44 AM