Share News

Seethakka: నడిగడ్డితండా హత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

ABN , Publish Date - Jun 17 , 2024 | 05:03 PM

హైదరాబాద్(Hyderabad) నడిగడ్డతండా(Nadigadda Tanda)లో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని మంత్రి సీతక్క(Minister Seethakka) పరామర్శించారు. మరిపెడ మండలం ఎల్లంపేటలోని బాధిత గిరిజన కుటుంబాన్ని మంత్రి సీతక్క స్వయంగా వెళ్లి ఓదార్చారు.

Seethakka: నడిగడ్డితండా హత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

మహబూబాబాద్: హైదరాబాద్(Hyderabad) నడిగడ్డతండా (Nadigadda Tanda)లో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని మంత్రి సీతక్క(Minister Seethakka) పరామర్శించారు. మరిపెడ మండలం ఎల్లంపేటలోని బాధిత గిరిజన కుటుంబాన్ని మంత్రి సీతక్క స్వయంగా వెళ్లి ఓదార్చారు. జూన్ 7న మియాపూర్ నడిగడ్డతండాలో బాలికపై హత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడం, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా మంత్రి సీతక్క బాధితుల స్వగ్రామానికి వెళ్లి వారిని పరామర్శించారు.


ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.." బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలకు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలే ప్రధాన కారణం. తెలంగాణలో గంజాయి, డ్రగ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారు. అత్యాచారాలు, హత్యాచారాలకు పాల్పడే నిందితులు ఎవరైనా, ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు. ఈ విషయంలో పోలీసులకు సీఎం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. వారికి ప్రభుత్వం తరఫున అందాల్సిన లబ్ధిని అందిస్తాం" అని చెప్పారు.

ఇది కూడా చదవండి:

TGNAB: విద్యార్థుల బ్యాగులు 100శాతం తనిఖీ చేయాల్సిందే: టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్

Updated Date - Jun 17 , 2024 | 05:03 PM