Share News

Rain Alert: ఈ ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్..

ABN , Publish Date - Jul 20 , 2024 | 09:20 AM

భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.

Rain Alert: ఈ ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్..
Heavy Rains

భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఉత్తర తెలంగాణా లోని 11 జిల్లాలలో ఈనెల 20 , 21 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు.జూలై 20, 21 తేదీలలో 11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్‌లో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, ఖమ్మం,కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ జిల్లాల కలెక్టర్లు ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని తెలియ చేశారు. ప్రధానంగా వాగుల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ 11 జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏ విధమైన సహాయం కావాలన్న రాష్ట్ర రాజధానికి ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చునని ఆమె అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్ద వాగు కు వచ్చిన ఆకస్మిక వరదల వల్ల చిక్కుకుపోయిన దాదాపు 40 మందికి ఏవిధమైన అపాయం జరుగకుండా వివిధ శాఖల సమన్వయంతో కాపాడినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ను శాంతి కుమారి అభినందించారు.

TGPSC: డిసెంబరుకు గ్రూప్‌-2 వాయిదా..


ఉమ్మడి వరంగల్ జిల్లాలో..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో బానరి రాజు అనే వ్యక్తి వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైనట్లు తెలుస్తోంది. పడవల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పలుచోట్ల పత్తి, వరి చేళ్లు మునిగిపోయాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు వర్షపు నీటితో నిండిపోతున్నాయి.

KTR: సర్కారు మార్గదర్శకాలే మాఫీకి మరణ శాసనాలు..


సింగరేణిపై రెయిన్ ఎఫెక్ట్..

భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రామగుండం రీజీయన్ లో నాలుగు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రోజుకు 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. మంచిర్యాలలోని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులలో ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, ఇందారం, ఆర్కేపీ, మందమర్రి, ఖైరీగూడ గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో 60వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కి విఘాతం ఏర్పడింది. సంస్థకు 10 కోట్ల మేర నష్టం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.


KTR: కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయ్.. మేడిగడ్డ నిండుకుండలా కావడంపై కేటీఆర్ హర్షం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jul 20 , 2024 | 11:33 AM