Share News

Yadagirigutta: డిజిటల్‌గా యాదగిరీశుడి ప్రసాద టికెట్లు

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:24 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రసాదం టికెట్లు డిజిటల్‌ సేవల ద్వారా అందుతున్నాయి.

Yadagirigutta: డిజిటల్‌గా యాదగిరీశుడి ప్రసాద టికెట్లు

భువనగిరి అర్బన్‌, సెప్టెంబరు 15: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రసాదం టికెట్లు డిజిటల్‌ సేవల ద్వారా అందుతున్నాయి. ఇప్పటివరకు ఆఫ్‌లైన్‌ ద్వారా మాత్రమే అందించే ప్రసాద టికెట్ల విక్రయంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే యాదాద్రిలో ఆర్జిత సేవలు సహా అన్ని విషయాల్లో డిజిటల్‌ సేవలు ఊపందుకున్నాయి.


తాజాగా ప్రసాదం టికెట్ల విక్రయం కూడా ఈ జాబితాలో చేరింది. టికెట్‌, ప్రసాదం పొందేందుకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. పీవోఎ్‌స (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) విధానం అందుబాటులో ఉన్నందున కొనుగోలు వివరాలన్ని కంప్యూటర్లలో నిక్షిప్తమవుతాయి. తద్వారా అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా సేవలు అందించగలుగుతున్నామని ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

Updated Date - Sep 16 , 2024 | 03:24 AM