Share News

Graduate: సన్యాసినిగా మారనున్న 19 ఏళ్ల గ్రాడ్యుయేట్

ABN , Publish Date - Jan 13 , 2024 | 06:14 PM

ఓ 19 ఏళ్ల యువతి సన్యాసిగా మారబోతున్నారు. అవును మీరు విన్నది నిజమే. చిత్తోర్‌కు చెందిన రాజస్థానీ జైన్ మార్వాడీ జ్యువెలర్ కుటుంబానికి చెందిన 19 ఏళ్ల కుమార్తె యోగితా సురానా హైదరాబాద్‌లో సన్యాసిని మారబోతుంది.

Graduate: సన్యాసినిగా మారనున్న 19 ఏళ్ల గ్రాడ్యుయేట్

ఓ 19 ఏళ్ల యువతి సన్యాసిగా మారబోతున్నారు. అవును మీరు విన్నది నిజమే. చిత్తోర్‌కు చెందిన రాజస్థానీ జైన్ మార్వాడీ జ్యువెలర్ కుటుంబానికి చెందిన 19 ఏళ్ల కుమార్తె యోగితా సురానా హైదరాబాద్‌లో సన్యాసిగా మారబోతుంది. జనవరి 13 నుంచి 16 వరకు నిర్వహించే జైన సమాజ్ దీక్షా మహోత్సవ్ కార్యక్రమంలో ఆమె సన్యాసిగా మారనున్నారు. యోగితా చిన్న వయస్సులోనే తన ప్రాపంచిక సుఖాలను త్యజించి నిరాడంబర జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. తన తల్లిదండ్రులు, సోదరీమణులతో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ఆమె కోరికల నుంచి తనను తాను మోక్ష మార్గాన్ని అనుసరించాలని అనుకుంటున్నట్లు తెలిపింది.


శ్రీవర్ధమాన్ స్థానక్వాసి జైన శ్రావక్ సంఘ్, గ్రేటర్ హైదరాబాద్, శ్రీజైన రత్న హితోషి శ్రావక్ సంఘ్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు సాధారణ మానవుడిని సన్యాసినిగా మార్చే ప్రక్రియను దీక్షా మహోత్సవ్ అంటారు. ఈ ప్రక్రియలో మతపరమైన ఊరేగింపు, సాధారణ మానవుడి నుంచి సన్యాసినిగా మారడాన్ని సూచించే ఆచారాలు ఉంటాయి.

15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి యాద్యాద్రి భవన్, బర్కత్‌పురా నుంచి షాలినీ ఆస్పత్రి, రాఘవేంద్ర దేవాలయం, టూరిస్ట్ హోటల్ మీదుగా కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుగా బర్కత్‌పురాలోని జూనియర్ కాలేజీ వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో 3000 మంది జైనులు పాల్గొంటారు. జనవరి 16 భగవతి దీక్షా మహోత్సవం ఉదయం 10:30 గంటలకు బర్కత్‌పురాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10,000 మంది హాజరుకానున్నారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: love not lust: మైనర్ బాలికపై అత్యాచారం..ఆ వ్యక్తికి బెయిల్ ఇస్తూ కోర్టు కీలక తీర్పు

అయితే యోగిత నిర్ణయం పట్ల మొదట ఆమె తల్లిదండ్రులు షాక్‌ అయ్యారు. కానీ వారు చివరికి ఆమె నిర్ణయాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేశారు. డిగ్రీని నిలిపివేసిన యోగిత హిందీ, తెలుగు, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతుంది. జైన సంప్రదాయంలో తమ బిడ్డ సన్యాసిని కావాలనే నిర్ణయాన్ని తల్లిదండ్రులిద్దరూ ఇష్టపూర్వకంగా అంగీకరించడం చాలా అవసరం. ఇక జైన సన్యాసులు, సన్యాసినులు కఠినమైన జీవితాన్ని గడుపుతారు. నీటిని సంరక్షించడానికి వారి జీవితమంతా స్నానం చేయకుండా ఉంటారు. ఈ వేడుకలో కాయ క్లేష్ అనే ఆచారం ఉంటుంది, ఇక్కడ ప్రతి వెంట్రుకలను బయటకు తీస్తారు. వారు ప్రపంచాన్ని తమ కుటుంబంగా భావించి వారి కుటుంబాల నుంచి వేరుగా జీవిస్తారు.

Updated Date - Jan 13 , 2024 | 06:15 PM