Share News

Union Minister: దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలి

ABN , Publish Date - Nov 12 , 2024 | 01:39 PM

కేంద్రీయ విద్యాలయాలు శక్తివంతమైన మినీ ఇండియా లాంటివని, ప్రతీ పాఠశాల భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు. తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రీయ ఏక్తా పర్వ్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Union Minister: దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలి

-కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్: కేంద్రీయ విద్యాలయాలు శక్తివంతమైన మినీ ఇండియా లాంటివని, ప్రతీ పాఠశాల భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు. తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రీయ ఏక్తా పర్వ్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాతికేళ్లలో భారత్‌ను విశ్వగురుగా తీర్చిదిద్దే సవాల్‌ను స్వీకరించాలని, యువత ఈ దిశగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఏక్‌ భారత్‌ శ్రేష్ట్‌ కార్యక్రమం కింద భిన్న సంస్కృతులను ఏకం చేసే కృషి జరుగుతుందని చెప్పారు. రాష్ట్రీయ ఏక్తా పర్వ్‌ లాంటి కార్యక్రమాలు దేశాన్ని సాంస్కృతికంగా ఏకం చేయడానికి దోహదం చేస్తాయన్నారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారటంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఈ వార్తను కూడా చదవండి: KTR: రేవంత్ నిన్ను వదలను.. ఢిల్లీలో కేటీఆర్ సవాల్


city11.2.jpg

ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) మాట్లాడుతూ.. 75 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం కూడా దేశంలో సాంస్కృతిక సమగ్రత పటిష్ఠంగా ఉందన్నారు. దేశ యువశక్తిని నైపుణ్యాలతో సుసంపన్నం చేయడానికి ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయన్నారు. దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించే కళలు, ఆచార వ్యహారాలను ప్రతిబింబించే స్టాళ్లను ఆయా రాష్ట్రాల విద్యార్థులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్‌, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ కమిషనర్‌ నిధి పాండే, హైదరాబాద్‌ రీజన్‌ కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ సహాయ కమిషనర్‌ మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..

ఈవార్తను కూడా చదవండి: IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

ఈవార్తను కూడా చదవండి: Khammam: బోనకల్‌లో యాచకుడికి ఐపీ నోటీసు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 12 , 2024 | 01:39 PM