Share News

Torture Case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. తులసిబాబు విచారణ..

ABN , Publish Date - Jan 08 , 2025 | 12:49 PM

ప్రకాశం జిల్లా: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కామేపల్లి తులసి బాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. రఘురామ కృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసి బాబుపై ఆరోపణలు ఉన్నాయి.

Torture Case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. తులసిబాబు విచారణ..
Raghurama custodial torture case

ప్రకాశం జిల్లా: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (AP Deputy CM Raghuramakrishnamraju)పై కస్టోడియల్ టార్చర్ కేసు (Custodial torture case)లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కామేపల్లి తులసి బాబు (Kamepalli Tulasi Babu)ను ప్రకాశం జిల్లా (Prakasam Dist.) ఎస్పీ దామోదర్ (SP Damodar) విచారించనున్నారు. రఘురామ కృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసి బాబుపై ఆరోపణలు ఉన్నాయి. తులసి బాబు తో పాటు రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్‌ను పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో అరస్టయి విజయ్ పాల్ ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్నారు. ఒక్కరోజు పోలీస్ కస్టడీకి గుంటూరు కోర్టు అనుమతి ఇవ్వడంతో విజయ్ పాల్‌ను పోలీసులు ఒంగోలు తీసుకువస్తున్నారు. విజయ్ పాల్, కామేపల్లి తులసి బాబును కలిపి పోలీసులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు విచారించనున్నారు.

ఇది కూడా చదవండి.

చంద్రబాబు, పవన్‌పై ఎంపీ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు


ఈ కేసులో నాల్గో నిందితుడిగా ఉన్న విజయ్ పాల్ గత నెలలో అరస్టయ్యారు. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు విజయ్ పాల్‌ను గుంటూరు నుంచి ఒంగోలు తీసుకువస్తున్నారు. రఘురామకృష్ణంరాజును 2021 మే14న అప్పటి జగన్ ప్రభత్వం అరెస్టు చేసిన తర్వాత గుంటూరు సీఐడీ కార్యాలయంలో రాత్రాంతా ఉంచి.. కామేపల్లి తులసి బాబు.. హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న తన గుండెలపై కూర్చొని టార్చర్ చేశారంటూ రఘురామ ఆరోపించారు. ఈ క్రమంలో తులసిబాబు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదట ఈనెల 3న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా.. తనకు ఆరోగ్యం బాగోలేదని సమయం కావాలని కోరగా బుధవారం (8వ తేదీ) విచారణకు హాజరుకావాలని మరో నోటీసు జారీ చేశారు.


డాక్టర్‌ ప్రభావతికి ముందస్తు బెయిల్ నిరాకరణ...

కాగా రఘురామకృష్ణరాజును కస్టోడియల్‌ టార్చర్‌కు గురి చేసిన కేసులో 5వ నిందితురాలుగా ఉన్న డాక్టర్‌ ప్రభావతి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ డాక్టర్‌ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగిశాయి. మెడికల్‌ బోర్డు చైర్మన్‌గా ఉన్న తాను ఈ కేసుకు సంబంధించిన బోర్డులోని ఇతర వైద్యులిచ్చిన రిపోర్టుల ఆధారంగా నివేదిక ఇచ్చానని ఆమె పేర్కొన్నారు. తాను నిర్దోషినని అనారోగ్యంతో ఉన్నానని తెలిపారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. కాగా, బాధితుడైన రఘురామ తన న్యాయవాదుల వాదనలు వినాలని ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారు. ఆయన తరఫున న్యాయవాదులు వీవీ లక్ష్మీ నారాయణ, కావూరి గోపీనాథ్‌ వాదనలు వినిపించారు. కస్టడీలో తనపై జరిగిన హత్యాయత్నం కేసులో డాక్టర్‌ ప్రభావతి భాగస్వామి అయ్యారని, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్య బృందం ఇచ్చిన నివేదికను ఆమె దురుద్దేశంతో ట్యాంపరింగ్‌ చేశారని పేర్కొన్నారు. ఆమెకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయరాదని కోర్టును కోరారు. మరోవైపు, ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరపున ప్రాసిక్యూషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభావతి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సింది పోయి మిగిలిన నిందితులతో కుమ్మక్కయ్యారని కోర్టుకు తెలిపారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రభావతికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అటు ఈడీ.. ఇటు ఏసీబీ...

ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సు..

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 08 , 2025 | 12:49 PM