Share News

iPhone: హుండీలో జారిపడ్డ ఐఫోన్‌.. రూ.10వేలకు దక్కించుకున్న సొంతదారు

ABN , Publish Date - Jan 10 , 2025 | 11:25 AM

మదురై సమీపం తిరుప్పోరూరు కందసామి ఆలయం హుండీలో జారిపడ్డ ఐఫోన్‌(iPhone)ను దాని సొంత దారుడు రూ.10వేలకు వేలంపాడి దక్కించుకున్నాడు.

iPhone: హుండీలో జారిపడ్డ ఐఫోన్‌.. రూ.10వేలకు దక్కించుకున్న సొంతదారు

చెన్నై: మదురై సమీపం తిరుప్పోరూరు కందసామి ఆలయం హుండీలో జారిపడ్డ ఐఫోన్‌(iPhone)ను దాని సొంత దారుడు రూ.10వేలకు వేలంపాడి దక్కించుకున్నాడు. రెండు నెలల క్రితం ఆ ఆలయానికి వెళ్ళి చెన్నై అంబత్తూరు వినాయకపురానికి చెందిన దినేష్‌(Dinesh) హుండీలో నగదు వేస్తుండగా అతడి జేబులోని ఐఫోన్‌ జారిపడింది. ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులకు ఆయన ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది. హుండీలో పడిన కానుకలన్నీ దేవుడికే సొంతమని చెప్పారు.

ఈ వార్తను కూడా చదవండి: Former CM: మాజీసీఎం బంధువు ఇళ్లల్లో ఐటీ తనిఖీలు


nani3.jpg

చివరకు ఆ ఫోన్‌లో ఉన్న సిమ్‌కార్డ్‌, మెమరీ కార్డు మాత్రమే ఆలయ నిర్వాహకులు తిరిగిచ్చారు. ఈ విషయం దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు దృష్టికి వెళ్ళింది. ఐఫోన్‌(iPhone) తిరిగి ఇచ్చే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెబుతామన్నారు. చివరకు హుండీలో పడిన వస్తువులను వేలం వేయాలనే ఆలయ నిబంధన ప్రకారమే దినేష్‌(Dinesh) ఐఫోన్‌కు ఆలయ నిర్వాహకులు వేలం పాడారు. దినేష్‌ ఆ వేలంపాటలో పాల్గొని రూ.10వేలకు తన ఐఫోన్‌ని తిరిగి దక్కించుకున్నాడు.


ఈవార్తను కూడా చదవండి: KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు

ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్‌’ యాప్‌

ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?

ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 10 , 2025 | 11:25 AM