Viral: భారీ శబ్దంతో భారతీయుల పెళ్లి ఊరేగింపు.. మండిపడ్డ కెనడా మహిళ.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 09 , 2025 | 11:48 PM
తన ఇంటి ముందు నుంచీ భారీ శబ్దం చేసుకుంటూ వెళ్లుతున్న ఓ భారతీయ పెళ్లి ఊరేగింపును చూసి కెనడా మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయు పెళ్లి వేడుక సందర్భంగా పెద్ద శబ్దంతో ఊరేగింపు నిర్వహించడంపై ఓ కెనడా మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాగైతే భారతీయులను అంతా ద్వేషిస్తారన్న కామెంట్‌తో ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది (Viral).
సేడీ క్రోవెల్ అనే మహిళ ఈ వీడియోను రికార్డు చేసింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు భారతీయులు బ్యాండు బాజాలు మోగించు కొంటూ పెళ్లి ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ పక్కనే ఉన్న భవనంలోని పైఅంతస్తులో ఉన్న సేడీ ఈ దృశ్యాలను రికార్డు చేసింది. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పెద్ద శబ్దం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను రెస్టు తీసుకునేందుకు ప్రయత్ని్స్తుంటే అకస్మాత్తుగా భారీ శబ్దాలతో ఊరేగింపు మొదలెట్టారని మహిళ వాపోయింది.
Viral: ఇన్ఫీ నారాయణ మూర్తిని మించిపోయిన ఎల్ అండ్ టీ చైర్మన్! వారానికి 90 గంటలు పనిచేయాలంటూ పిలుపు
కాగా, ఈ పోస్టుపై నెట్టింట భిన్నాభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. కొత్త సంస్కృతులు, సంప్రదాయాల విషయంలో సహనం పాటించాలని కొందరు అన్నారు. మరీ అంతలా ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
మరికొందరు మాత్రం పెళ్లి వారినే తప్పు బట్టారు. అతిథులుగా వెళ్లిన దేశంలో ఇలాంటివి అస్సలు చేయకూడదని అన్నారు. నివాససముదాయాలు ఉన్న ప్రాంతాల్లో ఇలాంటివి అనుమతిస్తారా అని మరికొందరు ప్రశ్నించారు. చుట్టూ ఉన్న వారికి ఇబ్బంది కలిగించకుండా వేడుక జరుపుకోవాలన్న జ్ఞానం లేకపోతే ఎలా అని మరో వ్యక్తి అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.
కాగా, అమెరికాలో హెచ్ -1బీ వీసా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు నెట్టింట సంచలనంగా మారింది. తన ప్రయత్నానికి మద్దతుగా నిలవాలంటూ సదరు వ్యక్తి ఏకంగా భారతీయుల నుంచి సంతకాలు సేకరించారు. భారతీయులే వద్దంటున్న హెచ్-1బీ వీసాను ఎందుకు సమర్థిస్తున్నారంటూ ట్రంప్‌ను ఉద్దేశించి ప్రశ్నించాడు. కాగా, ఈ వీడియోపై కూడా నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు. అనేక మంది భారతీయులకు మద్దతుగా నిలిచారు. శ్రమజీవులని ప్రశంసలు కురిపించారు. దీంతో, ఈ వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది.