Home » Congress 6 Gurantees
తెలంగాణపై పదేళ్లలో రూ.8లక్షల కోట్లను మాజీ సీఎం కేసీఆర్ అప్పు చేశారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఏ పథకాన్ని ఆపలేదు. త్వరలోనే పథకాలను గ్రౌండ్ చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో విడతాల వారిగా చేసిన దానికంటే తాము రుణమాఫీ చేసిన మొత్తం ఎక్కువేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు కాంగ్రెస్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ నిర్లక్ష్యం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ ఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు ప్రధానమైన నాలుగు రహదారులు విస్తరణ విషయంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం లేదా భూమి కేటాయించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠ చూపిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజలకు రేవంత్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందని మండిపడ్డారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అటకెక్కించారని విమర్శించారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (BJP) పోరుకు సిద్ధమైంది. సోమవారం ఇందిరా పార్క్ (Indira Park) ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష (Deeksha) చేపట్టింది. నిన్న ( సోమవారం) ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ప్రారంభమైన బీజేపీ దీక్ష ఈరోజు ఉదయం 11 గంటల వరకు కొనసాగుతుందని ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలిపారు.
తొమ్మిదేళ్లు తెలంగాణలో ప్రజా కంటగింపు పాలనను చూశామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కేసీఆర్ ఇక అధికారంలోకి రాడని.. నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలను ఒకలా.. హిందువులను మరోలా చూస్తున్నారని ధ్వజమెత్తారు.హిందువుల ఇళ్లను మాత్రమే హైడ్రా కూలుస్తుందని ఎంపీ అరవింద్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆసరా పథకం పైసలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు. రోడ్లు వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? అని ప్రశ్నించారు.
వ్యాపారవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను పవర్ సెంటర్ కావడం అనేది భవిష్యత్ నిర్ణయిస్తుందని అన్నారు. తన భార్య ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
కాంగ్రెస్ ఎగవేత... కోతల ప్రభుత్వమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. తన నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చిన ఎల్లప్పుడూ వారి సేవలోనే ఉంటానని తెలిపారు. పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు బంగారం మాటలకే పరిమితమైందని హరీష్‌రావు విమర్శించారు,