Home » Daggubati Purandeswari
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ.. తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.
సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్‌లపై మహిళా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇలాంటి అంశాలపై వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా సెమినార్లు నిర్వహిస్తామని వివరించారు. ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారంపై సైబర్ క్రైం కింద కేసులు పెడతామని హెచ్చరించారు.
ఏపీలో 13 జిల్లాల్లో వైసీపీ నేతలకు నచ్చిన వారికి ఇసుక రీచ్‌లు కట్టబెట్టి దోపిడీ చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అన్నారు. బీజేపీ ప్రజల పక్షాన నిలబడుతుందని.. వారి కోసం కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నేతలు కలిసి నడవాలని దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రికార్డు సమయంలో సహాయ చర్యలు చేపడుతున్నాయి. వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటున్నాం’ అని ఏపీ బీజేపీ అధ్యక్షురా లు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు గండి పడి విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్రమత్తమైన ఏపీ అధికార యంత్రాంగం గండి పూడ్చివేత పనులు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఆర్మీ జవాన్లతో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టింది.
‘ప్రజలే దేవుళ్లన్న ఎన్టీ రామారావు, జనతా జనార్దన్ అన్న నరేంద్ర మోదీ.. వ్యాఖ్యల స్ఫూర్తితో ప్రజలకు సేవకులమై వారి కన్నీరు తుడుస్తాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) వ్యాఖ్యానించారు. ఈ రైల్వే స్టేషన్‌ను రూ. 250 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలోని ప్రభుత్వ పథకాల పేరు మార్పుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. భావితరాలకు ఆదర్శనీయులైన శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో పథకాలు అమలు చేయడం అభినందనీయమని కొనియాడారు.
పొగాకు(Tobacco) అధికంగా పండించే బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పంటలు దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశపు పొగాకుకు మంచి డిమాండ్ ఏర్పడినట్లు రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(MP Daggubati Purandeswari) తెలిపారు. ఈ సందర్భంగా పరిమితి మించి పండించిన పొగాకుపై పెనాల్టీ లేకుండా చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda)ను కోరినట్లు ఆమె వెల్లడించారు.
Andhrapradesh: వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కోసారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని తెలిపారు.