Purandheswari: దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతాం.. పురంధేశ్వరి వార్నింగ్
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:33 PM
సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్‌లపై మహిళా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇలాంటి అంశాలపై వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా సెమినార్‌లు నిర్వహిస్తామని వివరించారు. ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారంపై సైబర్ క్రైం కింద కేసులు పెడతామని హెచ్చరించారు.
విజయవాడ: మహిళలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హెచ్చరించారు. దురాచారాలు, వేధింపులు మహిళలపై ఎక్కువ అవుతున్నాయని దగ్గుబాటి పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ వారి సమస్యల పరిష్కారంపై చర్చించినట్లు తెలిపారు. కామన్వెల్త్ కాన్ఫరెన్స్‌లో చాలా అంశాలపై మాట్లాడినట్లు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్‌లపై మహిళా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారని అన్నారు. ఇలాంటి అంశాలపై వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా సెమినార్‌లు నిర్వహిస్తామని వివరించారు. ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారంపై సైబర్ క్రైంలో కేసులు పెడతామని హెచ్చరించారు. సిడ్నీలో జరిగిన కామన్ వెల్త్ సమావేశంలో భారత్ ప్రతినిధిగా పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. సిడ్నీలో జరిగిన కాన్ఫరెన్స్‌లో తనను మహిళా ఎంపీగా వారికి ఛైర్మన్‌గా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనను పంపారని తెలిపారు. అన్ని సమావేశాల్లో పాల్గొని అనేక అంశాలపై చర్చ చేసినట్లు చెప్పారు. ఏపీ స్పీకర్ హోదాలో అయ్యన్న పాత్రుడు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారని అన్నారు. తన మీద ఉంచిన బాధ్యతకు పూర్తి న్యాయం చేసేలా పని చేస్తానని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.
వైసీపీ సైకో ఫ్యాక్టరీపై ఉక్కుపాదం...
మరోవైపు కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు వైసీపీ సైకో ఫ్యాక్టరీపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం సైబర్ నిపుణులతో స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వ పెద్దలు, మహిళా మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఫేక్ ఐడీలతో పోస్టులు పెట్టినా గుర్తించి పట్టుకునే విధంగా సాంకేతికతను వియోగిస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రత్యేక టీమ్‍లను రంగంలోకి దింపారు. జిల్లాలోని రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలకు చెందిన సోషల్ మీడియా గ్రూపులపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
YS JAGAN: జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా.. న్యాయమూర్తి ఏమన్నారంటే
YSRCP: రీ సర్వే డ్రోన్లు ఢమాల్.. రూ. 200 కోట్లు వృథా చేసిన జగన్
Bhanuprakash: అసెంబ్లీకి జగన్ గైర్హాజరుపై భానుప్రకాష్ సంచలన కామెంట్స్
Read Latest AP News and Telugu News