Share News

MP Purandeswari: ఆ పంటపై పెనాల్టీ తీసేయాలని కేంద్రమంత్రిని కోరా: ఎంపీ పురందేశ్వరి

ABN , Publish Date - Jul 10 , 2024 | 03:44 PM

పొగాకు(Tobacco) అధికంగా పండించే బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పంటలు దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో భారతదేశపు పొగాకుకు మంచి డిమాండ్ ఏర్పడినట్లు రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(MP Daggubati Purandeswari) తెలిపారు. ఈ సందర్భంగా పరిమితి మించి పండించిన పొగాకుపై పెనాల్టీ లేకుండా చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda)ను కోరినట్లు ఆమె వెల్లడించారు.

MP Purandeswari: ఆ పంటపై పెనాల్టీ తీసేయాలని కేంద్రమంత్రిని కోరా: ఎంపీ పురందేశ్వరి

రాజమహేంద్రవరం: పొగాకు(Tobacco) అధికంగా పండించే బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పంటలు దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో భారతదేశపు పొగాకుకు మంచి డిమాండ్ ఏర్పడినట్లు రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(MP Daggubati Purandeswari) తెలిపారు. ఈ సందర్భంగా పరిమితి మించి పండించిన పొగాకుపై పెనాల్టీ లేకుండా చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda)ను కోరినట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు పొగాకు రైతులతో కలిసి కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి కోరినట్లు చెప్పారు. ఎస్ఓపీ ధరనూ తగ్గించాలని కోరినట్లు చెప్పుకొచ్చారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపారు.


అంతర్జాతీయ మార్కెట్లో ముడి పొగాకు ఎగుమతి చేసే దేశంగా ఇండియాకు మంచి గుర్తింపు ఉందని, దేశంలో సిగరెట్ల తయారీ పరిశ్రమ 9శాతంగా ఉందని పేర్కొన్నారు. పొగాకు బేరన్లు క్యూరింగ్ చేసేందుకు సౌరశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని, దీనికి సీటీఆర్ఐ సైంటిస్టులు కృషి చేయాలని కోరారు. పంట సాగులో యాంత్రీకరణ ద్వారా పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే విధంగా సీటీఆర్ఐ పరిశోధనలు చేయాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో ఖరీఫ్, రబీ సీజన్‌లో పొగాకు సాగు చేసే అవకాశం ఒక్క భారతదేశంలో మాత్రమే ఉందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు.

ఇది కూడా చదవండి:

Diarrhea: పిడుగురాళ్ల లెనిన్ నగర్‌లో డయేరియా కలకలం..

Updated Date - Jul 10 , 2024 | 03:44 PM