Home » EVM Strong Room
నగరంలోని టవర్‌క్లాక్ సమీపంలో ఉన్న పాత ఆర్డీఓ కార్యాలయం ఆవరణంలో ఉన్న ఈవీఎంల గోడౌనతో పాటు జేఎనటీయూలోని ఈవీఎం గోడౌన్లను బుధవారం జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ పరిశీలించారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను కలెక్టర్ పరిశీలిం చారు.
‘పాల్వాయిగేటు వంటి సెన్సిటివ్ పోలింగ్ బూత్‌లో ఒకేఒక హోంగార్డును పెట్టి నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతా ఉందని చెప్పడం కోసం పిన్నెల్లి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం చేశా రు.
‘నా క్టైంట్ దొంగతనాలు చేశాడు. అయితే ఉరి శిక్ష వేస్తారా? దోపిడీలు చేశాడు... అయితే ఉరి శిక్ష వేస్తారా? బాంబులు కూడా వేశాడు. అయితే, ఉరి శిక్ష వేసేస్తారా?’... అదేదో సినిమాలో కమెడియన్ లాయర్ తన క్లైంటునే ఇలా కోర్టులో ఇరికించేస్తాడు.
పోలింగ్ రోజు జరిగిన దాడులు, అనంతర పరిణామాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం చేయడం వైసీపీ అరాచకానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కౌంటింగ్ వరకూ పిన్నెల్లిని అరెస్టు చేయొద్దు అంటే అర్థం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. ఇంత దరిద్రపుగొట్టు ఎలక్షన్స్ దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని అసహనం వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సా్ట్రంగ్ రూమ్‌లలో భద్ర పరిచిన ఈవీఎంల రక్షణ బాధ్యత పోలీసులదేనని టీడీపీ కూట మి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె గురువా రం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, 130సీట్ల లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి సందేహాలు లేవనెత్తారు. ఈవీఎం స్టోర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు సంబంధించి లైవ్ లింక్ ఇవ్వాలని కోరారు. సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఆర్వోని అడిగామని తెలిపారు. గతంలో లైవ్ లింక్ ఇచ్చారనే విషయాన్ని కేఏ పాల్ గుర్తుచేశారు.