KA Paul: స్ట్రాంగ్ రూమ్ భద్రతపై కేఏ పాల్ సందేహాలు..!!
ABN , Publish Date - May 21 , 2024 | 03:51 PM
స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి సందేహాలు లేవనెత్తారు. ఈవీఎం స్టోర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు సంబంధించి లైవ్ లింక్ ఇవ్వాలని కోరారు. సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఆర్వోని అడిగామని తెలిపారు. గతంలో లైవ్ లింక్ ఇచ్చారనే విషయాన్ని కేఏ పాల్ గుర్తుచేశారు.
విశాఖపట్టణం: స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ (KA Paul) మరోసారి సందేహాలు లేవనెత్తారు. ఈవీఎం స్టోర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు సంబంధించి లైవ్ లింక్ ఇవ్వాలని కోరారు. సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఆర్వోని అడిగామని తెలిపారు. గతంలో లైవ్ లింక్ ఇచ్చారనే విషయాన్ని కేఏ పాల్ గుర్తుచేశారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు భారీగా డబ్బులు పంచాయని, మద్యం సరఫరా చేశాయని కేఏ పాల్ ఆరోపించారు. ఓటర్లకు తాను రూపాయి పంచలేదని స్పష్టం చేశారు. విజయంపై తనకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు రోజున అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కేఏ పాల్ కోరారు. ఈ మేరకు పోలీసు శాఖకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. విశాఖపట్టణం లోక్ సభ నుంచి ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగగా.. వచ్చే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు.
Read Latest AP News and Telugu News