Home » Home Minister Anitha
రాష్ట్ర అసెంబ్లీ గురువారం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నవారి భరతం పట్టడంతోపాటు రేషన్ బియ్యం స్మగ్లింగ్, ఇసుక మాఫియాలను ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లు, భూ దురాక్రమణల (నిషేధిత) సవరణ బిల్లుతో పాటు మరో 5 బిల్లులను ఆమోదించింది.
దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి వచ్చిన వారూ శాసన మండలిలో నీతులు చెప్పడం దారుణమని రాష్ట్ర హోం మంత్రి అనిత వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు.
అసెంబ్లీలో అధికార పక్షమే ప్రతిపక్షమయింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రజా సమస్యలపై, అభివృద్ధి కార్యక్రమాలపై సభ్యులు వేసిన ప్రశ్నలకు మంత్రులు స్పందించారు.
రవీంద్ర రెడ్డి గురించి అనిత ప్రస్తావించారు. రవీంద్ర రెడ్డి తప్పు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ రవీంద్ర రెడ్డిని కాపాడేందుకు జగన్ అండ్ కో ప్రయత్నిస్తోంది. లీగల్ టీమ్‌తో జగన్ వార్ రూమ్ మెయింటెన్ చేస్తున్నాడు. రవీంద్ర రెడ్డి ఎవరో కాదు జగన్ సతీమణీ భారతీ పీఏ అని తెలుస్తోంది అని చెప్పుకొచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ నోటి వెంట వినకూడని మాటలు వస్తున్నాయని మండిపడ్డారు. మా కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తోందని తెలిపారు.
అనితపై వ్యాఖ్యల తర్వాత డిప్యూటీ సీఎం పవన్- హోం మంత్రి కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు దగ్గరగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదే అంశంపై హోం మంత్రి అనిత వివరణ ఇచ్చారు.
గ్రామపంచాయతీల నిధులు కూడా మాజీ సీఎం జగన్ దోచుకున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి సింపతీ క్రియేట్ చేయడం జగన్‌కి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలన్నదే జగన్ ఆలోచన అని హోంమంత్రి అనిత విమర్శించారు.
ఇంటర్ చదువుతున్న బాలిక దస్తగిరమ్మపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో నాలుగు బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశారన్నారు.
రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర హోం మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.
‘పోలీసులు ఉన్నది ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడానికి. గత ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి సొంత ప్రతీకారాలకు వాడుకుంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ప్రజా పోలీసింగ్‌కే ప్రాధాన్యమిస్తాం.